కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు వైద్యులు దీనికి వ్యాక్సిన్ ని కూడా కనుగొనలేకపోయారు. చాలా మంది దీనికి మందు కనుగొనడానికి తమ వంతు ప్రయత్నాలు తాము  చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 7వేల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 2లక్షల మందికి పైగా వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు.

Also Read కరోనాకు పారాసిటమాల్... కేసీఆర్, జగన్ లు చెప్పింది నిజమేనంటున్న డాక్టర్లు...

ఈ వైరస్ పేరు వింటేనే ప్రజలు భయపడిపోతోంటే.. కేవలం పారసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతోదంటూ ఇటీవల సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా.. సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై బీజేపీ మహిళా నేత సాధినేని యామిని సీరియస్ అయ్యారు. కరోనాను ఎదురుకోవడానికి కేవలం ఒక పారసెటమాల్ ట్యాబ్లెట్ సరిపోతుందని చెప్పడం సరికాదన్నారు. కరోనాను ఎదురుకోవడానికి పారసెటమాల్ వేసుకుంటే.. అది ప్రాణాలకే ముప్పు అయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇక బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా వైరస్ చనిపోతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి తీసుకునే చర్యలకంటే ఎక్కువగా స్థానిక ఎన్నికలే ముఖ్యమనే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌కు కులం అంటగడుతూ.. ఏక వచనంతో సంబోధించడం సీఎంకు తగదన్నారు.