Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో మూడో మరణం... కరోనా సోకి ముంబయిలో వ్యక్తి మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మంగళవారం ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా... సదరు వ్యక్తికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని.. వాటికి తోడు ఇది కూడా తోడయ్యందని అధికారులు చెబుతున్నారు.
 

Coronavirus crisis: One person has been confirmed dead in Mumbai
Author
Hyderabad, First Published Mar 17, 2020, 11:13 AM IST

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మూడో మరణం కూడా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మంగళవారం ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా... సదరు వ్యక్తికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని.. వాటికి తోడు ఇది కూడా తోడయ్యందని అధికారులు చెబుతున్నారు. మృతుడు 64ఏళ్ల వృద్ధుడుగా గుర్తించారు.

Also Read కరోనావైరస్ తో ఢిల్లీలో మహిళ మృతి: దేశంలో రెండో మరణం...

ఇదిలా ఉండగా..  దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో నేటి వరకు మొత్తం 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా విదేశాలకు పోయి వచ్చిన వారే. అయితే కరోనా రోగుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇక కరోనా వ్యాప్తి గత వారం ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్స్‌కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ బాంబేకు మార్చి 29 వరకు సెలవులు ప్రకటించారు. ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్‌ను మూసివేశారు.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 114కి చేరింది. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబయిలో 8, పుణెలో 16, నాగ్‌పూర్‌ 4, నవీ ముంబయి 2, యావత్మల్‌ 3, థానే, కల్యాణ్‌, అహ్మద్‌నగర్‌, ఔరంగాబాద్‌, రాయిగడ్‌లో ఒక్కొక్క కేసు చొప్పు నమోదు అయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios