Jyotiraditya Scindia: ప్రస్తుతం ప్రపంచం మొత్తం  చంద్రయాన్ 3 వైపే చూస్తోంది. ఇది విజయవంతంగా ల్యాండింగ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా, చంద్రయాన్ విజయవంతం అయినందుకు ప్రధానిని, శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభినందించారు.

Jyotiraditya Scindia: భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌ 3 తుది అంకంలోకి చేరుకుంది. మరోకొన్ని గంటల్లో జాబిల్లిపైకి అడుగుపెట్టనున్నది. ఈ క్షణం కోసం కేవలం భారత్‌ ఒక్కటే కాదు.. ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇది బుధవారం చంద్రునిపైకి దిగనుంది.

చంద్రయాన్‌ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇస్రో తన ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది. ఇస్రో సక్సెస్‌ రేటుకు తోడు భారతీయ శాస్త్రవేత్తల పరిజ్ఞానం.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే తిరుగులేని శక్తిగా మార్చింది. ఈ ప్రయోగంతో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటనున్నాయి. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు చంద్రయాన్‌ 3 పైనే ఉన్నాయి.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 ప్రయోగం ప్రశంసలు గుప్పించారు. ప్రధాని మోదీతో పాటు దేశ శాస్త్రవేత్తలకు (ఇస్రో) శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని కీర్తించారు. చంద్రయాన్ విజయంపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

భారత్‌లోని నిపుణులు, శాస్త్రవేత్తలు అద్భుత చరిత్ర సృష్టించారని అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రశంసించారు. భారతదేశపు త్రివర్ణ పతాకం దేశంలోనే కాదు ప్రపంచ వేదికపై కూడా రెపరెపలాడింది. అయితే ఇప్పుడు చంద్రుడిపై కూడా భారత త్రివర్ణ పతాకాన్ని తమ ప్రయత్నమని అన్నారు. అదే సమయంలో.. కేంద్రమంత్రి సింధియాతో పాటు నిపుణులు, శాస్త్రవేత్తలందరూ ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.