విమానం ఆలస్యమైందని పైలట్ పై ప్రయాణికుడి దాడి.. జ్యోతిరాదిత్య సింధియా ఏమన్నారంటే ?
ఇండిగో విమానంలో పైలట్ పై ప్రయాణికుడు దాడి చేసిన (The passenger hit Indigo flight pilot) ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (social media)వైరల్ (viral)గా మారింది. అయితే దీనిపై తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Civil Aviation Minister Jyotiraditya Scindia)స్పందించారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పొగమంచు కారణంగా విమానం ఆలస్యమైన అనంతరం రద్దు కావడం వల్ల ఓ ప్రయాణికుడు పైలట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్న సమయంలో ఢిల్లీ-గోవా ఇండిగో విమానంలో పైలట్ పై అతడు దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పదించారు. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కేజే జాయ్ కన్నుమూత..
ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘పొగమంచు సంబంధిత ప్రభావాన్ని తగ్గించడానికి భాగస్వాములందరూ 24 గంటలు పనిచేస్తున్నారని ప్రయాణీకులకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వికృత ప్రవర్తన సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. దీనిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాము’’ అని ఆయన పేర్కొన్నారు.
పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడిని అరెస్టు చేశామని, అతడిని నో ఫ్లై జాబితాలో చేర్చాలని కోరుతూ ఇండిగో ఈ విషయాన్ని అంతర్గత కమిటీకి నివేదించిందని తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రద్దు, ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రయాణికుల మెరుగైన కమ్యూనికేషన్, సౌకర్యాలపై విమానయాన నియంత్రణ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థలకు ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేస్తుందని సింధియా చెప్పారు.
మటన్ కోసం దోస్తు మర్డర్.. సికింద్రాబాద్ లో ఘటన
కాగా.. దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత ఉందని ఇండిగో పైలట్ ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ ఆలస్యాన్ని ప్రకటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు విమానంలోని పైలట్ వైపు దూసుకొచ్చి కొట్టాడు. దీనిని అక్కడున్న ప్రయాణికులు వీడియో తీశారు. అయితే పైలట్ పక్కన నిల్చున్న ఫ్లైట్ అటెండెంట్ కన్నీటి పర్యంతమై పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఇక ఫాస్టాగ్ కూ కేవైసీ.. ఇంకా 15 రోజులే గడువు..! లేకపోతే డీ యాక్టివేట్..
విమానం కొన్ని గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికుడు ఆందోళనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం.. ఇండిగో విమానం 10 గంటలకు పైగా ఆలస్యం తర్వాత సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది. కాగా.. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా లేదా రద్దవడంతో పలు విమానాశ్రయాలు, ముఖ్యంగా ఢిల్లీలో ఆదివారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 100 విమానాలు ఆలస్యంగా, ఐదు విమానాలను దారి మళ్లించారు. ఆందోళనకు దిగిన ప్రయాణికులు గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.