ప్రముఖ సంగీత దర్శకుడు కేజే జాయ్ కన్నుమూత..
KJ Joy : మలయాళ సినీ సంగీత పరిశ్రమ (Malayalam film music industry)లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు కేజే జాయ్ కన్నుమూశారు (Music director KJ Joy passed away). ఆయన 200 పైగా చిత్రలకు సంగీతం అందించగా.. 500కు పైగా చిత్రాలకు సహాయకుడిగా పని చేశారు.
KJ Joy passed away : ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు కేజే జాయ్ ఇక లేరు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన 77 ఏళ్ల వయస్సుల్లో శనివారం చనిపోయారు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. కేజే జాయ్ మలయాళ పరిశ్రమలో టెక్నో మ్యూజిషియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. 1970లో కీబోర్డు వంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించి సంగీతంలో నిపుణుడిగా పేరుగాంచారు.
ఇక ఫాస్టాగ్ కూ కేవైసీ.. ఇంకా 15 రోజులే గడువు..! లేకపోతే డీ యాక్టివేట్..
కేజే జాయ్ 1975లో మలయాళ సినిమాల్లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో పాటలు కంపోజ్ చేశారు. పాటలను కంపోజ్ చేయడమే కాకుండా, 500 కి పైగా చిత్రాలకు సహాయకుడిగా కూడా పనిచేశారు. మలయాళ ఇండస్ట్రీలో కేజే జాయ్ కు మంచి పేరుంది. సంగీత ప్రపంచంలో ఎన్నో మార్పులు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లా నెల్లికున్నులో 1946లో జన్మించిన జాయ్ సినీ పరిశ్రమలో తన దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో రెండు వందలకు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఆయన మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన అప్పటి నుంచి ప్రజలను ఉర్రూతలూగించిన అనేక పాటల రూపొందించారు. జాయ్ చేసిన ప్రయోగాలే మలయాళ సినీ సంగీత రంగంలో పెనుమార్పులకు దారితీశాయి.
మటన్ కోసం దోస్తు మర్డర్.. సికింద్రాబాద్ లో ఘటన
కాగా.. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేజే జాయ్ మృతి పట్ల మలయాళ నేపథ్య గాయకుడు, స్వరకర్త ఎంజీ శ్రీకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేజే జాయ్ అంత్యక్రియలు బుధవారం చెన్నైలో జరగనున్నాయి.