రాజ్యాంగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థ ఎవరికీ అనుకూలంగా ఉండదని, కేవలం రాజ్యాంగానికి మాత్రమే జావాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు గట్టి సందేశం ఇచ్చారు. ప్రతి ప్రభుత్వం చర్యకు న్యాయపరమైన మద్దతు లభిస్తుందని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు విశ్వసిస్తాయని అన్నారు. మరో వైపు న్యాయ వ్యవస్థ తమ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని తెలిపారు. కానీ న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వతంత్రమైనదని, అది రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని అన్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రత్యేక పూజలు..
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి రమణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. “ఈ సంవత్సరం నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాజ్యాంగం ద్వారా ప్రతి సంస్థకు అప్పగించిన పాత్రలు, బాధ్యతలను నెరవేర్చడం మనం ఇంకా నేర్చుకోలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ’’ అని అన్నారు.
Nupur Sharma: నుపూర్ శర్మను అరెస్టు చేయండి: జమాతే ఇస్లామీ హింద్
ప్రభుత్వ అన్ని చర్యలనూ న్యాయ వ్యవస్థ సమర్థింస్తుందని అధికార పార్టీ భావిస్తుందని, అలాగే తమ రాజకీయ ఎజెండాను న్యాయ వ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుందని సీజేఐ తెలిపారు. రాజ్యాంగంపై సరైన అవగాహన లేకపోవడంతే ఈ తప్పుడు ఆలోచన విజృంభిస్తోందని అన్నారు. ‘‘ ఇది స్వతంత్ర యంత్రాంగాన్ని అంటే న్యాయవ్యవస్థను దించడమే ఏకైక లక్ష్యంగా ఉన్నశక్తుల సహాయంతో సాధారణ ప్రజలలో ప్రచారమైన తప్పుడు అభిప్రాయం. మనం దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు, సంస్థల పాత్రలు, బాధ్యతలపై అవగాహన కల్పించాలి. ’’ అని అన్నారు.
భారతదేశం, యుఎస్ రెండూ వైవిధ్యా నికి ప్రసిద్ధి చెందాయని, ఈ వైవిధ్యాన్ని ప్రపంచంలోని
ప్రతి చోటా గౌరవించాల్సిన అవసరం ఉందని, పెంపొందించాల్సిన అవసరం ఉందని సీజేఐ రమణ అన్నారు. అమెరికా వైవిధ్యా న్ని గౌరవిస్తుందని అందుకే మీరందరూ ఈ దేశానికి చేరుకోగలిగారని ప్రవాస భారతీయులను ఉద్దేశించి అన్నారు. మీ కృషి, అసాధారణ నైపుణ్యాల ద్వారా ఒక ముద్ర వేయగలిగారని తెలిపారు. అమెరికా సమాజం సహనశీలత, సమ్మిళిత స్వభావం ప్రపంచవ్యా ప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించగలిగిందని అన్నారు. ఈ లక్షణాలు దాని అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. విభిన్న నేపథ్యాల నుంచి అర్హులైన ప్రతిభావంతులను గౌరవించడం, ఆత్మవిశ్వాసాన్నికాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ.. ప్రధాని మోడీపై మరో మనీహిస్ట్ పోస్టర్‌తో విమర్శలు
ప్రజలందరినీ ఐక్యంగా ఉంచే సమస్యలపై దృష్టి పెట్టాలి తప్ప, విభజించే విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 2021లో 113 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులలో భారీ ద్వై పాక్షిక వాణిజ్యా నికి దారితీసిందని, ఇది భారతదేశం, యుఎస్ ప్రజల మధ్య ప్రగతిశీల భాగస్వా మ్యం అని సీజేఐ రమణ అన్నారు. సిలికాన్ వ్యాలీలో 50 శాతం బిజినెస్-టు-బిజినెస్ స్టార్టప్ లు, భారతీయుల ద్వారా స్థాపించబడ్డాయని లేదా నిధులు సమకూరుస్తున్నాయని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
