జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులను పట్టించిన పచ్చబొట్టు, వైర్ లెస్ సెట్...
నిందితుల చేతికి ఉన్న పచ్చబొట్టు, ఒక పోలీసు నుండి దొంగిలించబడిన వైర్‌లెస్ సెట్, సీసీటీవీ ఫుటేజీలు ఐటీ ప్రొఫెషనల్ జిగిషా ఘోష్ హత్య కేసును ఛేదించడంలో ఢిల్లీ పోలీసులకు సహాయపడ్డాయి. ఇవే ఆధారాలు టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకుల ఆచూకీ తెలిపాయి
ఢిల్లీ : టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి వారికి... పచ్చబొట్టు, వైర్‌లెస్ సెట్టు, సిసిటివి ఫుటేజీలు సహాయపడ్డాయి. మొదట వీటి ఆధారాలతో ఢిల్లీ పోలీసులు ఐటి ప్రొఫెషనల్ జిగిషా ఘోష్ హత్య కేసును ఛేదించారు. ఈ క్రమంలోనే టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులను కనిపెట్టడంతో ఇవే ఆధారాలు తోడ్పడ్డాయి.
2009లో జిగిషా ఘోష్‌ను హత్య చేసినందుకు అరెస్టయిన రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్ 2008లో విశ్వనాథన్ హత్యలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు. సౌమ్యా విశ్వనాథన్‌ను హత్య కేసులో... హత్య, ఇతర నేరాలకు సంబంధించిన క్రైమ్ సిండికేట్‌కు చెందిన కపూర్, శుక్లా, మాలిక్, అజయ్ కుమార్ అనే నలుగురు వ్యక్తులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది.
ఐదవ నిందితుడు అజయ్ సేథీని సెక్షన్ 411 (నిజాయితీ లేకుండా దొంగిలించబడిన ఆస్తిని స్వీకరించడం), మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం వ్యవస్థీకృత నేరాలకు సహకరించడం, సహాయం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా సహకరించడం, వ్యవస్థీకృత నేరాల ఆదాయాన్ని స్వీకరించడం వంటి నిబంధనల ప్రకారం కోర్టు దోషిగా నిర్ధారించింది.
ముగ్గురి అంగీకార వాంగ్మూలాలను అనుసరించి, ఢిల్లీ పోలీసులు అజయ్ కుమార్, అజయ్ సేథీలను అరెస్టు చేశారు. సౌమ్య విశ్వనాథన్‌ను సెప్టెంబర్ 30, 2009 తెల్లవారుజామున ఆమె ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో హత్య చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మార్చి 18, 2009న జిగిషా ఘోష్ దోపిడి, హత్యకు గురయ్యింది.
ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి, నలుగురికి గాయాలు..
"జిగిషా హత్య కేసు వెలుగు చూసిన రెండు-మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. ఫరీదాబాద్‌లోని సూరజ్ కుండ్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి సిసిటివి ఫుటేజీ నుండి మాకు మొదటి లీడ్ వచ్చింది, అక్కడ నిందితులలో ఒకరు జిగిషా డెబిట్ కార్డ్ తో షాపింగ్ చేస్తున్నప్పుడు అతని చేతిపై పచ్చబొట్టు ఉండడం గమనించాం. టోపీ పెట్టుకున్న మరొకరు వైర్‌లెస్ సెట్‌తో ఉన్నారు”అని కేసు దర్యాప్తు అధికారి అతుల్ కుమార్ వర్మ పిటిఐకి చెప్పారు.
ఢిల్లీ పోలీసుల హ్యూమన్ ఇంటిలిజెన్స్ నెట్‌వర్క్ అధికారులు కేసు విషయంలో పరిశీలించిన తరువాత మసూద్‌పూర్‌లోని మాలిక్ నివాసానికి చేరుకుంది. ఆ తర్వాత కపూర్, శుక్లా అరెస్ట్ అయ్యారు. మాలిక్ చేతిపై అతని పేరు సిరా ఉంది, కపూర్ ఒక పోలీసు అధికారి నుండి లాక్కున్న వైర్‌లెస్ సెట్‌ను వాడుతున్నారు.
వసంత్ విహార్‌లోని ఆమె ఇంటి దగ్గర నుంచి జిగిషాను కిడ్నాప్ చేసి, దోపిడి చేసిన తర్వాత హత్య చేసి మృతదేహాన్ని పారేశామని, ఆమె డెబిట్ కార్డులను ఉపయోగించి షాపింగ్ కూడా చేశామని తెలిపారని వర్మ తెలిపారు. వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారుల బృందానికి వర్మ నాయకత్వం వహిస్తున్నాడు.
వసంత్ విహార్‌కు బాగా దూరంలో ఉన్న నెల్సన్ మండేలా మార్గ్‌లో మరో అమ్మాయిని హత్య చేశామని రవికపూర్ స్వయంగా వెల్లడించడంతో మేం ఒకింత షాక్‌కు గురయ్యామని వర్మ తెలిపారు. ఆ హత్యలో మరో ఇద్దరు సహచరులు - అజయ్ కుమార్, అజయ్ సేథి ప్రమేయం ఉన్నదని కూడా అతను చెప్పాడు. అప్పటి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్), హెచ్‌జిఎస్ ధలివాల్, వెంటనే మరో అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి, రెండు హత్య కేసులను పరిశీలించడానికి ఎసిపి భీషమ్ సింగ్‌ను నియమించారు.
సింగ్ పిటిఐతో మాట్లాడుతూ, "సౌమ్య హత్య కేసులో నిందితులు తెలిశారు. ఇక ఇప్పుడు ఫోరెన్సిక్ సాక్ష్యాలను కూడా సేకరించడం మా ముందున్న ముఖ్యమైన సవాలు" అన్నారు. సౌమ్య విశ్వనాథన్ హత్యకు గురైన రోజు రాత్రి కపూర్ మారుతీ వ్యాగన్‌ఆర్ కారును నడిపారని, శుక్లా అతని పక్కనే కూర్చున్నారని పోలీసులు తెలిపారు. మాలిక్, కుమార్ వెనుక సీటులో ఉన్నాడు. వీరంతా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
"సెప్టెంబర్ 30న, ఒక కారు నిందితులు ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేసింది. ఆ కారు వసంత్‌కుంజ్‌లోని తన ఇంటికి తిరిగి వెళుతున్న సౌమ్య ప్రయాణిస్తున్న మారుతీ జెన్. ఆమె టీవీ టుడే కార్యాలయం నుండి తిరిగి ఇంటికి వెడుతోంది. కరోల్ బాగ్‌లోని వీడియోకాన్ టవర్ దగ్గర వారి కారును దాటింది" అని మరో అధికారి తెలిపారు.
ఓ మహిళా డ్రైవర్ తమను ఓవర్‌టేక్ చేయడం, ఆమె ఒంటరిగా ఉండడం చూసిన నిందితులు తమ వాహనం వేగం పెంచి ఆమె బండి దగ్గరకు వచ్చారు. మొదట వారు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె తన కారును ఆపకపోవడంతో, కపూర్ సౌమ్య వాహనంపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆ తరువాత సౌమ్య కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆగిపోయింది. "ఆ తరువాత నిందితులు సంఘటన స్థలం నుండి పారిపోయారు, కానీ 20 నిమిషాల తరువాత, ఆమె పరిస్థితిని చూడటానికి తిరిగి వచ్చారు. అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకోవడంతో.. అది చూసిన వారు పారిపోయారు" అని అధికారి చెప్పారు.
"సౌమ్య హత్యకేసులోనూ వీరే నిందితులని ప్రాథమికంగా మూడు కారణాల వల్ల నేరారోపణ జరిగింది. నిందితులనుండి స్వాధీనం చేసుకున్న నేరానికి సంబంధించిన ఆయుధం, స్పాట్, ఫోరెన్సిక్ స్కెచ్, నిందితుల ఒప్పుకోలు స్టేట్‌మెంట్‌తో సరిపోలిన సంఘటన జరిగిన విధానం" అని సింగ్ చెప్పారు.