Asianet News TeluguAsianet News Telugu

ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి, నలుగురికి గాయాలు..

మంగళూరు సిటీ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మీదికి వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 

car rammed into the footpath, Woman died, four injured in Mangaluru - bsb
Author
First Published Oct 19, 2023, 9:34 AM IST

మంగళూరు : మంగళూరులో విషాద ఘటన వెలుగు చూసింది.  ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానిక లేడీహిల్ సమీపంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. మంగళూరు సిటీ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ సమీపంలోని పాదచారుల వీధిలో మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. 

డ్రైవర్ కమలేష్ బల్దేవ్ తన కారును వారిపైకి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలిని 23 ఏళ్ల రూపశ్రీగా గుర్తించారు. గాయపడిన నలుగురిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కమలేష్ బల్దేవ్ ప్రమాదం తరువాత ఘటనా స్థలం నుండి పారిపోయారు. ఆ తరువాత తన కారును కార్ షోరూమ్ ముందు పార్క్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. 

పోలీసులు బల్దేవ్‌పై  ఇండియన్ పీనల్ కోడ్సెక్షన్‌లు 304(A) (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), 279 (రాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం), 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యల ద్వారా గాయపరచడం), 338 కింద కేసులు నమోదు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios