మీకు ఏది సముచితం అనిపిస్తే అది చేయండి: నరవణేతో రాజ్ నాథ్ సింగ్
చైనా ఆర్మీ సరిహద్దుల్లో కదలికలతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే ప్రస్తావించారు. ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్ తో జరిగిన సంభాషణను ఆయన పంచుకున్నారు.
న్యూఢిల్లీ: మీకు ఏది సముచితం అనిపిస్తే అది చేయండని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు చెప్పారు. 2020 ఆగస్టు 30న చైనా, భారత మధ్య సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తూర్పు లడఖ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న రెచిన్ లా పర్వత మార్గంలో చైనా తన ఆర్మీని మోహరించిన సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ నరవణేతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో నరవణే భారత ఆర్మీ చీఫ్ గా పనిచేసిన విషయం తెిలిసిందే. 2022 ఏప్రిల్ మాసంలో మనోజ్ ముకుంద్ నరవణే రిటైరయ్యారు.
ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో తన జ్ఞాపకాలను మనోజ్ ముకుంద్ నరవణే నెమరువేసుకున్నారు. ఆనాటి పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ సిబ్బంది చీఫ్ ల మధ్య ఫోన్ కాల్స్ గురించి ఆయన వివరించారు.ఈ విషయమై పరిస్థితి క్లిష్టతను రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలిపినట్టుగా నరవాణే గుర్తు చేసుకున్నారు.
తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా రాజ్ నాథ్ సింగ్ చెప్పారని నరవాణే గుర్తు చేసుకున్నారు. ఇది పూర్తి సైనిక నిర్ణయమని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారన్నారు. మీకు ఏది సముచితమనిపిస్తే అది చేయాలని తనకు రాజ్ నాథ్ సింగ్ చెప్పారన్నారు. దీంతో తనపైనే పూర్తి బాధ్యత ఉందని చెప్పారు. ఆ సమయంలో కొన్ని నిమిషాలు గట్టిగా ఊపిరి పీల్చుకుని మౌనంగా కూర్చున్నట్టుగా నరవాణే ప్రస్తావించారు.
ఆ సమయంలో తాను ఆర్మీ హౌస్ లోని తన డెన్ లో ఉన్నట్టుగా నరవణే చెప్పారు. తాము దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టుగా నరవణే తెలిపారు. ఆ రోజు తన ఆలోచనల గురించి రాశారు.
కరోనా మహమ్మారితో దేశం అధ్వాన్న స్థితిలో ఉంది. ఆర్ధిక వ్యవస్థ కుంటుపడింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో తమ మద్దతుదారులు ఎవరు, చైనా, పాకిస్తాన్ నుండి వచ్చే ముప్పు ఏమిటనే విషయమై ఆలోచించినట్టుగా ఆయన పేర్కొన్నారు.
ఈ ఆలోచనల తర్వాత నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వై.కే . జోషిని పిలిచాడు.ఈ విషయమై చర్చించినట్టుగా రాశారు.భారత్ వైపు నుండి కాల్పులు చేయవద్దని తాను జోషిని ఆదేశించినట్టుగా నరవణే గుర్తు చేసుకున్నారు.
భారత దేశ యుద్ధ ట్యాంకులను కనుమ ముందువైపు నుండి తీసుకెళ్లి వారిపై దాడి చేయాలని వై.కే. జోషికి చెప్పినట్టుగా నరవణే గుర్తు చేసుకున్నారు.తాము ఈ ప్రయత్నం చేసిన వెంటనే కొన్ని వందల మీటర్ల లోపలకు చేరుకున్న చైనాకు చెందిన యుద్ధ ట్యాంకులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని నరవాణే చెప్పారు.
ఆగస్టు 29, 30 మధ్య రాత్రి పీఎల్ఏ మోల్డో నుండి చుటి చాంగ్లా ప్రాంతానికి సౌత్ బ్యాంక్ వైపు సైన్యాన్ని తరలించిందని నరవాణే రాశాడు. అదే రోజు సాయంత్రానికి కొన్ని దళాలు కైలాష్ శ్రేణి ముందుకు వచ్చాయని చెప్పారు.
అయితే 30వ తేదీన సాయంత్రం నాటికి పాంగోంగ్స్ , ఉత్తర, దక్షిణ ప్రాంతాలతో పాటు కైలాష్ శ్రేణిలో భారత సైన్యం బలమైన స్థితిలో ఉందని నరవాణే చెప్పారు. 30 వ తేదీ సాయంత్రానికి చైనా సైన్యం కైలాష్ శ్రేణి ప్రాంతంలో తమ బలగాలకు 500 మీటర్ల దూరంలో ఉన్నారని నరవాణే చెప్పారు.
అయితే చైనా ఆర్మీ నుండి ఎలాంటి ముప్పు లేదు. కానీ వారు శక్తివంతంగా భారత ప్రాంతాలను చుట్టుముట్టడానికి లేదా చుట్టుముట్టడానికి యత్నిస్తే కచ్చితంగా చర్య తీసుకోవాలన్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని నరవాణే రాసుకొచ్చాడు.
ఆగస్టు 31నాటి పగటి పూట పీఎల్ఏ వైపు చాలా కదలికలు కన్పించాయన్నారు. అదే రోజు మధ్యాహ్నం నాటికి తారా బేస్ వద్ద ఉన్న మా ట్యాంకులను కూడ రెచిన్ లా వరకు తరలించాలని ఆదేశించినట్టుగా నరవాణే తెలిపారు. కొన్ని ఇతర ప్రదేశాల్లో కూడ పీఎల్ఏ కదలికలు కన్పించాయన్నారు. 2015 ఆగస్టు 31 సాయంత్రం జోషి చాలా ఆందోళనతో తనకు ఫోన్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పదాతి దళం మద్దతున్న నాలుగు ట్యాంకులు నెమ్మదిగా రెచిన్ లా వైపు వెళ్తున్నట్టుగా చెప్పారు.ఈ విషయమై ఆర్ఎం, ఈఎఎం, ఎన్ఎస్ఏ, సీడీఎస్ మధ్య తనకు మధ్య పోన్ సంభాషనలు జరిగినట్టుగా ఆయన గుర్తు చేసుకున్నారు.
తన ఆదేశాల గురించి ప్రతి ఒక్కరు అడిగారనన్నారు. అదే రోజు 21 గంటల సమయంలో ట్యాంకులు ముందుకు కదిలినట్టుగా నార్తర్న్ కమాండ్ నుండి సమాచారం వచ్చిందన్నారు.
తాను మళ్లీ 21:25 గంటలకు ఆర్ఎంకీ రింగ్ చేసినట్టుగా చెప్పారు. అదే సమయంలో పీఎల్ఏ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ రెండు వైపులా కదలికలను నిలిపివేయాలని ఇద్దరు స్థానిక కమాండర్లు మరుసటి రోజు ఉదయం 0930 గంటలకు పాస్ వద్ద కలుసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, అజిత్ ధోవల్ ను కు సమాచారం ఇచ్చినట్టుగా నరవణే చెప్పారు.