న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.799 ప్రీపెయిడ్ ప్యాక్ ను జియో  కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ ప్లాన్‌లో రోజుకూ 6.5 జీబీ డేటాను అందిస్తోంది. 

రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌పై జియో యూజర్లు 182 జీబీ హై స్పీడ్ 4 జీ డేటాను పొందే అవకాశం ఉంటుందని జియో ప్రకటించింది.  రూ.799 ప్రీపెయిడ్ రీ ఛార్జీ ప్లాన్లపై అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది.  28 రోజులు వాలిడిటీతో రోజుకు  6.5జీబీతో  హై-స్పీడ్ 4 జి డేటా ఉచితంగా అందించనుంది.

ఇక వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం.  100 ఎస్ఎంఎస్ లు కూడ ఉచితమే. జూన్ 30 వరకు  ఈ ప్లాన్‌ను రీచార్జీ చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్టుగా  రిలయన్స్ జియో ప్రకటించింది.

గతంలో మాదిరిగానే  రూ. 300లతో పాటు ఆపై రీ చార్జీలపై రూ.100 డిస్కౌంట్ ను అందిస్తోంది. రూ. 300 లోపు రీచార్జీ చేస్తే 20 శాతం డిస్కౌంట్ ను ఆఫర్ ను అందించనున్నట్టు జియో ప్రకటించింది.

  అయితే రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కు   28 రోజుల వ్యవధిలో  రోజుకు  5జీబీ డేటా చొప్పున 140జీబీ డేటాను అందిస్తుంది.కానీ, కొత్త ప్లాన్ ప్రకారంగా   రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా ఆఫర్‌ చేస్తోంది.  రూ.149, రూ.349, రూ. 399, రూ. 449 తదిర  రీచార్జ్‌ప్లాన్లపై రోజుకు వాస్తవంగా అందిస్తున్న 4 జీజీ డేటా ఆఫర్‌ను రిలయన్స్ జియో పెంచుతూ నిర్ణయం తీసుకొంది.