జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి అధికారాన్ని అందుకోగా.. బీజేపీ నేతల డిపాజిట్లు గల్లంతయ్యాయి

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి అధికారాన్ని అందుకోగా.. బీజేపీ నేతల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

Also Read:సీఎంల ఓటమి చరిత్ర మరోసారి రిపీట్.... ఓటమి అంచున రఘుబర్ దాస్

స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సరయి రాయ్ చేతిలో ఆయన దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Also Read:జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లైవ్: ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి.. ఓటమి దిశగా సీఎం రఘుబర్‌దాస్

రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సరయికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన చివరి నిమిషంలో రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకంగా సీఎంనే ఓడించారు. ఆయనతో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు, స్పీకర్ సైతం ఓటమి చవిచూశారు.

కాగా 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి 47 సీట్లతో అధికారాన్ని అందుకోగా.. బీజేపీ 25, జార్ఖండ్ వికాస్ మోర్చా 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 2 సీట్లలో గెలిచాయి. కూటమిలో జేఎంఎంకు 30, కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీకి 5 స్థానాలు దక్కాయి.