Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లైవ్: ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి.. ఓటమి దిశగా సీఎం రఘుబర్‌దాస్

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం నాడు ప్రారంభమైంది. 

Jharkhand Election Results 2019 live updates: Couting of votes starts
Author
New Delhi, First Published Dec 23, 2019, 7:51 AM IST

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను దాటింది. కాంగ్రెస్ 4 స్థానాల్లో, జేఎంఎం 5 స్థానాల్లో గెలవగా.. ఆర్జేడీ 3 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. అటు బీజేపీ 6 చోట్ల విజయం సాధించి, 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

తాజాగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలని గమనిస్తుంటే.. ఆ రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి 42 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బిజెపి 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

బీజేపీ కన్నా ముందంజలో ఉండడంతో కాంగ్రెస్, జేఎంఎం శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. మరోవైపు జార్ఖండ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రఘువర్ దాస్ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఫలితాలు ముగిసే సమయానికి కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. 

కాంగ్రెస్, జేఎంఎం కూటమి జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ కూటమి 42 స్థానాల్లోఆధిక్యంలో ఉంది. బిజెపి 28 చోట్ల మెజారిటీతో కొనసాగుతోంది. 

పరిస్థితి ఇలానే కొనసాగి హాంగ్ ఏర్పడితే.. ప్రభుత్వ ఏర్పాటులో  ఎజెఎస్ యు, జివిఎం పార్టీలు కీలకం కానున్నాయి. 

 ఎజెఎస్ యు, జివిఎం పార్టీలు చెరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కోనసాగుతున్నాయి.   

జార్ఖండ్ లో ఎన్నికల ఫలితాల సరళి ఉత్కంఠగా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు 41 సీట్లు అవసరం కాగా ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

కాంగ్రెస్, జేఎంఎం కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తోంది. 43 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా బీజేపీ 27 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. 

జేఎంఎం లీడర్ హేమంత్ సోరెన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆయన బర్ హెట్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. దుంకా నియోజకవర్గంలో వెనుకబడ్డారు. 

కాంగ్రెస్, జేఎంఎం కూటమి మంచి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ కూటమి అధిక్యాలు నిలిచాయి. కానీ తాజాగా బిజెపిని వెనక్కి నెడుతూ కాంగ్రెస్ కూటమి 41 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బిజెపి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

జెంషెడ్ పూర్ నియోజకవర్గంలో సీఎం రఘువర్ దాస్ ఆధిక్యంలోకి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో, బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

బిజెపి, కాంగ్రెస్ కూటమి మధ్య హోరా హోరీ పోరాటం జరుగుతోంది. బిజెపి 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

ధన్ వార్ నియోజకవర్గం నుంచి బాబు లాల్ మారండి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సీఎం రఘువర్ దాస్ వెనుకంజలో ఉన్నారు. 

జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి.. బిజెపి పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ కూటమి 33 చోట్ల, బిజెపి 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జేవీఎం పార్టీ 3 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.  

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి ఆధిక్యాన్ని ప్రదరిస్తోంది. ఈ కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి 24 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ జంషెడ్ పూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై సరయురాయ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 

కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. బిజెపి అభ్యర్థులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.  ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తున్నారు

రాయ్‌పూర్:జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలోని 81 స్థానాలకు  జరిగిన ఎన్నికలకు  రెండు దఫాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ 30, డిసెంబర్ 20 వ తేదీ వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది.

సోమవారం నుండి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. అత్యధికంగా 28 రౌండ్లలో చందయాంకరి, తొర్పా అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల కౌంటింగ్ కు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో రెండో దఫా అధికారంలోకి రావాలని బీజేపీ తన శక్తిని ధారపోసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios