విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్: జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతి

విదేశాలకు వెళ్లే వారికి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పరీక్ష రాయాలనుకొనేవారు వెంటనే ధరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ చెప్పారు.

JEEMains exams: Students get another chance to apply for the entrance exam

న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే వారికి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పరీక్ష రాయాలనుకొనేవారు వెంటనే ధరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ చెప్పారు.

విదేశాలకు వెళ్లాలనుకొన్న అభ్యర్థులంతా ఈ నెల 24వ తేదీ లోపుగా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ పరీక్షలు జూలై 18-23 తేదీల్లో నిర్వహించనున్నారు. దేశంలోని పలువురు విద్యార్థుల నుండి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా కేంద్రం తెలిపింది.  

also read:గుడ్‌న్యూస్: ఐఐటీ-జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల షెడ్యూల్ ఇదీ

ఏదైనా కారణాలతో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ధరఖాస్తు చేసుకోని వారు కూడ ఈ నెల 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించింది. రెండు స్థాయిల జేఈఈ ప్రవేశ పరీక్షల్లో జేఈఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి మొదటిదశ. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఈ ఏడాది ఆగష్టు మాసంలో నిర్వహించనున్నట్టుగా కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయితే పరీక్షలు నిర్వహించే తేదీని మాత్రం ప్రకటించలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios