Asianet News TeluguAsianet News Telugu

గుడ్‌న్యూస్: ఐఐటీ-జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల షెడ్యూల్ ఇదీ

ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది జూలై 18-23 మధ్య నిర్వహించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఆగష్టు మాసంలో జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

JEE-Mains, JEE-Advanced, NEET exam dates announced
Author
New Delhi, First Published May 5, 2020, 1:43 PM IST

న్యూఢిల్లీ: ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది జూలై 18-23 మధ్య నిర్వహించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఆగష్టు మాసంలో జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఇవాళ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.ఐఐటీ -జేఈఈ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలపై కూడ కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది జూలై 26వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.

ఐఐటీ -జేఈఈ  మెయిన్స్ పరీక్షలను జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఆగష్టు మాసంలో నిర్వహించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. కానీ, ఏ రోజున ఈ పరీక్షలు నిర్వహిస్తామనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ తేదీని తర్వాత ప్రకటించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.

లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని  పలు రాష్ట్రాలు పలుు ప్రవేశ పరీక్షలను రద్దు చేశాయి. ఐఐటీ -జేఈఈ , నీట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ఇతర రాష్ట్రాలు కూడ పరీక్షల షెడ్యూల్ కూడ ప్రకటించే అవకాశం ఉంది.

also read:కరోనా దెబ్బ: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలపై కూడ బోర్డు నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.  దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఈ ఏడాది నీట్ పరీక్షల కోసం 15 లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. జేఈఈ  మెయిన్స్ పరీక్షల కోసం 9 లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios