Asianet News TeluguAsianet News Telugu

జేడీయూ, ఆర్జేడీ కూటమి జాతీయ రాజకీయాలపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు - ప్రశాంత్ కిషోర్

బీహార్ లో ఏర్పడిన కొత్త కూటమి జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇది బీహార్ కే పరిమితం అవుతుందని అన్నారు. 

JDU-RJD alliance won't have much impact on national politics - Prashant Kishore
Author
First Published Aug 14, 2022, 1:50 PM IST

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జేడీ-యూ, ఆర్జేడీల క‌ల‌యిక జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూప‌బోద‌ని ప్రముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. బీహార్ లో రెండు పార్టీల పునర్విభజనను గత 10 సంవత్సరాలలో రెండో సారి ‘రాజకీయ ఏర్పాటు’గా ఆయన అభివర్ణించారు. ఆయ‌న పాట్నాలో TNIE తో మాట్లాడారు. “ నితీష్ కుమార్ చేసిన రాజకీయ ఏర్పాటుకు ఇది ఆరో ఉదాహ‌ర‌ణ‌. గత 10 సంవత్సరాలలో ఈ ‘రాజకీయ నిర్మాణం’ జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపిస్తుందని నాకు అనిపించడం లేదు. ఇది కేవ‌లం బీహార్ కే ప‌రిమితం. ’’  అని అన్నారు.

మరోసారి చర్చకు నెహ్రూ.. విభజన వీడియోతో బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్ కౌంటర్

‘‘ తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరూ కూడా తమ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ తర్వాత ఉద్యోగావకాశాలు కల్పిస్తామని గతంలో వాగ్దానం చేశారు. ఇప్పుడు దీనిని నిజం చేయాల్సిన అవసరం ఉంది ’’ అని ఆయన అన్నారు. 

కాగా.. ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు JD(U) వైస్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు. అలాగే నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నారు. అయితే నితీష్ కుమార్ పార్ల‌మెంట్ లో NCR పై BJP విధానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో JD(U) నుంచి ఆయ‌న వైదొలిగారు. దీనిని ఉద్దేశించి ఆయ‌న ప‌రోక్షంగా మాట్లాడారు. ‘‘గతంలో నితీష్‌ కుమార్‌ బీజేపీతో ఉన్నప్పుడు కూడా తెగదెంపులు చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఎందుకు చేయలేదు? బీజేపీతో కలిసి ఉన్న‌ప్ప‌టి కంటే ఆర్‌జేడీతో ఈ కొత్త ప్రభుత్వం గతం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది’’ అని అన్నారు. 

ఉచిత హామీలు ఇచ్చే ముందు ఆర్థిక బ‌లాన్ని చూసుకోండి.. రాష్ట్రాల‌కు నిర్మలా సీతారామన్ సూచ‌న‌

ఆర్జేడీతో జేడీయూతో రాజ‌కీయ పొత్తు ఎంత కాలం ఉంటుంద‌నే ప్ర‌శ్న‌కు పీకే స‌మాధానం ఇచ్చారు. ‘‘ గత ఆరు సందర్భాలలో ప్రతి సారీ, ప్రతి రాజకీయ నిర్మాణం దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది.’’  అని అన్నారు. గత అనుభవాల నుంచి కూడా దీనిని అంచనా వేయొచ్చు అని ఆయ‌న చమత్కరించారు.

ఇదిలా ఉండ‌గా.. 2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీ(యూ), బీజేపీతో క‌లిసి ఎన్డీఏ కూట‌మిగా పోటీ చేశాయి. ఆర్జేడీ మ‌హా కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేశాయి. అయితే ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి విజ‌యం సాధించింది. రెండు సంవత్స‌రాల పాటు ఈ కూట‌మి విజ‌యవంతంగా బీహార్ ను ప‌రిపాలించింది. అయితే ఇటీవ‌ల బీజేపీకి, జేడీ(యూ)కి మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయి. దీంతో ఆ కూట‌మి వీగిపోయింది. జేడీ(యూ) త‌న ప్ర‌తిప‌క్షం అయిన ఆర్జేడీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

దొంగ‌త‌నం చేశాడ‌నే అనుమానంతో 9 ఏళ్ల బాలుడిని చిత‌క‌బాదిన పోలీసులు.. వీడియో వైర‌ల్

కాగా.. ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తుతం బీహార్ రాష్ట్రంపైనే దృష్టి పెట్టారు. ఆ రాష్ట్రంలో ‘జన్-సూరజ్’ పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇది అక్టోబర్ 2వ తేదీన ముగియ‌నుంది. ఆయ‌న బీహార్ లో 2025 లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు పార్టీని ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios