Asianet News TeluguAsianet News Telugu

ఉచిత హామీలు ఇచ్చే ముందు ఆర్థిక బ‌లాన్ని చూసుకోండి.. రాష్ట్రాల‌కు నిర్మలా సీతారామన్ సూచ‌న‌

ఉచిత పథకాల హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక బలా బలాల గురించి ఆలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఉచిత పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడం మంచి పరిణామం అని తెలిపారు. 

Check your financial strength before giving free guarantees.. Nirmala Sitharaman advises states
Author
First Published Aug 14, 2022, 1:01 PM IST

రాష్ట్ర ప్రభుత్వాలు ’ఉచితాలను’ ప్రకటించే ముందు తగిన బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక బ‌లాన్ని చూసుకోవాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సూచించారు.  గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ 'రెవ్డీ' సంస్కృతిపై విరుచుకుపడిన తర్వాత ఉచితాల అంశం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో నిర్మ‌లా సీతార‌మ‌న్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. బీజేపీ కర్ణాట‌క ఎకనామిక్ సెల్ విశ్వ గురు భారత్ సావనీర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

వివాహ వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

ప్రతీ రాష్ట్రం ఉచితాలు ఎలా ఉండవచ్చనే దృక్పథాన్ని తప్పనిసరిగా కల్గి ఉండాల‌ని, అలాగే తగినంత ఆర్థిక బలం ఉందా లేదా అనే విష‌యాన్ని తెలుసుకోవాల‌ని సూచించారు. అలాగే తగినంత ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగ‌తుల‌ను అర్థం చేసుకోకుండా ఉచితాల కోసం నిబంధనలు రూపొందించడం వల్ల భవిష్యత్ తరాలపై భారం పడుతుందని ఆమె అన్నారు. ‘‘ వాగ్దానం చేసిన వ్యక్తి (ఉచితాలు) దానిని నెరవేర్చాలి. అయితే దాని భారం భవిష్యత్తు తరాలపై కూడా ఉంటుంది ’’ అని ఆమె అన్నారు.

దొంగ‌త‌నం చేశాడ‌నే అనుమానంతో 9 ఏళ్ల బాలుడిని చిత‌క‌బాదిన పోలీసులు.. వీడియో వైర‌ల్

ఉచితాలు ఆర్థిక వ్యవస్థపై  వాటి ప్రభావంపై చర్చను స్వాగతిస్తూ  ఆమె ఇలా అన్నారు. “ ఇప్పుడు ఈ అంశంపై చాలా ఆసక్తి నెలకొంది. నిజమైన చర్చ అవసరం.’’  అని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగిన నిర్మలా సీతారామన్ మంచి, నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వంపై ఉంద‌ని అన్నారు. “ ఎవరైనా విద్యను ఉచిత వస్తువుగా పరిగణిస్తే అది బాధ్యతా రహితమైన, తప్పుదారి పట్టించే ప్రకటన. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నుండి సంక్షేమ రాష్ట్రాలు ఎన్నటికీ వెనుకంజ వేయవు ” అని ఆమె అన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నియమించబడిన వివిధ కమిటీలు ఆరోగ్యం, విద్య, ఇతర ప్రాథమిక అవసరాలకు స్థూల దేశీయోత్పత్తిలో కనీసం ఆరు శాతం ఖర్చు చేయాలని ఎప్పుడూ పట్టుబట్టాయ‌ని సీతారామన్  గుర్తు చేశారు. నేటి వరకు ఏ ప్రభుత్వమూ విద్య పట్ల తన బాధ్యతను తిరస్కరించలేదని, ప్రైవేట్ మాత్ర‌మే ఆ ప‌నిని చేప‌ట్టాల‌ని అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఆమె అన్నారు. బ్యాంకులు మోసపోతున్నా.. డిపాల్ల‌ర్లను విడిచిపెట్టబోమ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. “ బ్యాంకులను మోసం చేసిన వారి ఆస్తులు వేలం వేస్తాము. వారి బకాయిలు క్లియ‌ర్ చేస్తాం. ఇది నిరంతరం జరుగుతోంది’’ అని ఆమె అన్నారు.

కుండలో నీళ్లు తాగాడని దళిత విద్యార్థిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు..

పంజాబ్, ఢిల్లీ ప్ర‌భుత్వాల‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ మీరు వారికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తార‌ని వాగ్ధానం చేశారు. దీని వ‌ల్ల ఎంత మంది ప్ర‌జ‌లు ల‌బ్ది పొందుతున్నారో తెలుసు. దీని కోసం మీ బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేస్తారు ’’ అని  ఆమె ప్ర‌శ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios