Asianet News TeluguAsianet News Telugu

మ‌ణిపూర్ లోనూ బీజేపీతో జేడీ(యూ) తెగదింపులు ? బీరేన్ సింగ్ ప్ర‌భుత్వానికి ఎఫెక్ట్ ?

బీహార్ లో బీజేపీతో విడిపోయినట్టుగానే మణిపూర్ లోనూ ఆ పార్టీతో తెగదింపులు చేసుకోవాలని జేడీ(యూ) ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో త్వరలో నిర్వహించే ఆ పార్టీ జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

JD (U) breaks with BJP in Manipur too ? The effect of Biren Singhs government?
Author
First Published Aug 31, 2022, 7:58 AM IST

బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎతో నితీష్ కుమార్ కు చెందిన జేడీ(యూ) ఇటీవ‌ల త‌న బంధాన్ని తెంచుకుంది. ఆర్జేడీ, వామ‌పక్షాలు, కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్న కొన్ని వారాల త‌రువాత జేడీ(యూ) మ‌ణిపూర్ లో కూడా ఇలాంటి అడుగే వేయ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌మెంట్ లో భాగంగా ఉన్న ఆ పార్టీ దాని నుంచి వైదొల‌గాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. 

జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు షురూ.. రాయ్‌పూర్‌కు వెళ్లిన యూపీఏ ఎమ్మెల్యేలు..

జేడీ(యూ) ప్రస్తుతం ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి బ‌య‌టి నుంచి మద్దతును అందిస్తోంది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నెల మొద‌ట్లోనే ఎన్నికల సంఘం మణిపూర్‌లో జేడీ (యూ)ని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. 60 మంది సభ్యుల అసెంబ్లీలో 55 సీట్లను కలిగి ఉన్న బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణానికి వీరి మ‌ద్ద‌తు ఉంది. అయితే ఈ కూట‌మి నుంచి జేడీయూ వైదొల‌గిన రాష్ట్ర ప్ర‌భుత్వంపై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం లేదు. అధికార కూట‌మి నుంచి ఆ పార్టీ తెగ‌దింపులు చేసుకున్నా మెజారిటీ మార్కు 31 కంటే ప్ర‌భుత్వానికి ఎక్కువ‌గానే ఎమ్మెల్యేలు ఉంటారు.

భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాని మోడీ

నితీష్ కుమార్ బీహార్ లో ఎన్‌డీఏతో బంధాన్ని తెంచుకున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ ఇప్పటివరకు మణిపూర్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏకైక జేడీ(యూ) ఎమ్మెల్యే ఇటీవలే బీజేపీలో చేరారు. కాగా మ‌ణిపూర్ విష‌యంలో ఎలాంటి ముంద‌డుగు వేయాల‌నే విష‌యం సెప్టెంబర్ 3-4 తేదీల్లో పాట్నాలో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఫైనల్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అల్ల‌ర్ల‌కు సంబంధించిన నేరాల్లో టాప్ లో మ‌హారాష్ట్ర.. త‌ర్వాతి స్థానాల్లో బీహార్, యూపీ: ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్

JD(U) తన జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి సమావేశాలను వరుసగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లో పాట్నాలో నిర్వహించనుంది. ఇవి ఆ పార్టీ రెండు ముఖ్యమైన సంస్థాగత సంస్థలు. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమితో చేతులు క‌లిపిన నేప‌థ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కుమార్ తీసుకున్న ఈ స్టెప్ విపక్షాల శిబిరంలో కొంత శక్తిని నింపింది 2024 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండొచ్చ‌నే ఊహాగానాలకు దారితీసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios