Asianet News TeluguAsianet News Telugu

అల్ల‌ర్ల‌కు సంబంధించిన నేరాల్లో టాప్ లో మ‌హారాష్ట్ర.. త‌ర్వాతి స్థానాల్లో బీహార్, యూపీ: ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్

ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్స్: ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ప్రతిరోజూ కనీసం 174 రకాల క్రిమినల్ నేరాలు IPC సెక్షన్ల క్రింద నమోదయ్యాయి. ఇందులో 2021లో 14 హింసాత్మక నేరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అల్లర్లకి సంబంధించిన కేసుల నమోదులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
 

Maharashtra top in riot-related crimes. Bihar, UP followed: NCRB reports
Author
First Published Aug 31, 2022, 5:36 AM IST

న్యూఢిల్లీ: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ ) ప్రకారం.. 2021లో భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 3,67,218 కేసులు నమోదయ్యాయి. నేరాల నమోదులో ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి రెండవ స్థానంలో ఉంది. ప్రతిరోజూ కనీసం 174 రకాల క్రిమినల్ నేరాలు IPC సెక్షన్ల క్రింద నమోదయ్యాయి. ఇందులో 2021లో 14 హింసాత్మక నేరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అల్లర్లకి సంబంధించిన కేసుల నమోదులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో భాగమైన న్యూ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం ముంబ‌యిలో క్రిమినల్ కేసులు 27 శాతం పెరిగాయి. 2021లో 63,689  కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కుముందు సంవ‌త్సారాలైన 2020లో 50,158 కేసులు, 2019లో 40,684 కేసులు న‌మోద‌య్యాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. హత్య, కిడ్నాప్, అత్యాచారం వంటి హింసాత్మక నేరాలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు,  పిల్లలపై నేరాలు కూడా గత సంవత్సరం ఆర్థిక రాజధానిలో పెరిగాయని నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా అల్లర్లకు సంబంధించిన కేసుల నమోదులోనూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2021లో రాష్ట్రంలో ఇటువంటి 8,709 నేరాలు (ఇందులో 77 మతపరమైన అల్లర్లు, 86 రాజకీయ, 67 కుల సంఘర్షణలు, 355 అగ్రకులాల దాడులు, 197 ఆర్థిక‌, 1,259 భూమి-ఆస్తి వివాదాలు, 304 కుటుంబ వివాదాలు) నమోదయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం మహారాష్ట్ర తర్వాత బీహార్ (6,298), ఉత్తరప్రదేశ్ (5,302), కర్ణాటక (4,193), తమిళనాడు (2,275), హర్యానా (2,253), ఒడిశా 2,220 ఉన్నాయి. లక్షలకు లెక్కించిన జనాభా రేటు ప్రకారం, 2021లో ప్రధాన నగరాల్లో జరిగిన మొత్తం నేరాల సంఖ్యలో ముంబ‌యి దేశంలో 11వ స్థానంలో ఉంది. 2020లో ఈ నగరం 15వ స్థానంలో ఉంది. 2021లో మహారాష్ట్రలో నమోదైన IPC కేసుల సంఖ్య 3,67,218, ఇది దేశంలోనే అత్యధికం. అయితే ఇది 2020లో 3,94,017 నుండి 6.8 శాతం తగ్గింది. పశ్చిమ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (3,57,905) తర్వాతి స్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ  నివేదిక పేర్కొంది. చిన్నారులు చేసే నేరాల విషయంలో ముంబ‌యి జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. మెట్రోపాలిస్‌లో మైనర్లు చేసిన 611 నేరాలు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ‌గా దొంగతనం, దాడి కేసులు ఉన్నాయి.

2021లో ముంబ‌యిలో సైబర్ నేరాలు 15.6 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ  డేటా చూపించినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలావ‌ర‌కు రాత‌పూర్వక ఫిర్యాదులను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)గా మార్చనందున అలాంటి అనేక కేసులు నివేదించబడలేదు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, ఆర్థిక రాజధానిలో 2021లో మొత్తం 2,883 వివిధ రకాల సైబర్ నేరాలు నమోదయ్యాయి. 2020లో 2,433 కేసులు, 2019కి ముందు కోవిడ్-19 సంవత్సరంలో 2,527 నమోదయ్యాయి. మహారాష్ట్రలో సైబర్ నేరాలు 2020లో 5,496 నుండి 2021లో 1.5 శాతం స్వల్పంగా పెరిగి 5,562 న‌మోద‌య్యాయి. 2019లో 4,967 న‌మోద‌య్యాయి. మహారాష్ట్రలో నమోదైన ఇలాంటి కేసుల్లో ఎక్కువ శాతం డెబిట్/క్రెడిట్ కార్డ్, లైంగిక దోపిడీ, వ్యక్తిగత ప్రతీకారం-దోపిడీకి సంబంధించినవేనని నివేదిక పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios