Jayalalitha Poes Garden House: తమిళనాడు మాజీ సీఎంజయలలిత మేనకోడలు దీప అధికారికంగా పోయెస్ గార్డెన్ లోని వేదనిలయాన్ని స్వాధీనం చేసుకుంది. జయలలిత వార‌సుల‌కే వేద నిలయాన్ని అప్ప‌జేప్ప‌లని , స్మారక కట్టడంగా మార్చబోవ‌డాన్ని మ‌ద్రాస్ కోర్టు తప్పుపట్టింది. కోర్టు ఆదేశాల మేర‌కు చెన్నై కలెక్టర్ విజయరాణి....జయ నివాస తాళాలను దీపకు అధికారికంగా అందజేశారు. తమకు ఇది అతిపెద్ద విజయమని  దీప పేర్కొన్నారు.   

Jayalalitha Poes Garden House: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు అసలైన వారసురాలిని తానేనని, మాజీ సీఎం జ‌య నివాసమైనా పొయెస్ గార్డెన్‌లోని వేద నిలయానికి కూడా తామే వార‌సులమని జ‌య‌ల‌లిత అన్న కుమార్తె, కుమారుడు దీప, దీప‌క్ లు కోర్టు మెట్లు ఎక్కిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో మ‌ద్రాస్ కోర్టు సంచ‌ల‌న తీర్పు నిచ్చింది. వేద నిలయాన్ని దీపకు అందించాలని తీర్పు నిచ్చింది. ఆ ఆదేశాల మేర‌కు చెన్నై కలెక్టర్ విజయరాణి .. వేదా నిల‌యం తాళాల‌ను దీప‌కు అప్ప‌జెప్పారు. 

మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత.. ఆమె నివాసాన్ని త‌మిళ సర్కారు స్వాదీనం చేసుకుంది. దీంతో జయ నివాసం వేద‌నిల‌యాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ జయ మేనళ్లుడు, మేనకొడలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీపక్‌ వేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని మ‌ద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. 

Read Also; https://telugu.asianetnews.com/national/omicron-scare-section-144-imposed-in-mumbai-for-48-hours-r3xp5n

విచార‌ణ స‌మయంలో త‌మిళ ప్ర‌భుత్వ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. పోయస్ గార్డెన్‌లోని జయ నివాసం వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించిన తీరును త‌ప్పుప‌ట్టింది. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చే హ‌క్కు పార్టీకి ఎవరు ఇచ్చార‌ని ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే.. మెరీనా బీచ్‌లో జయలలిత స్మారక మందిరం ఉందని, ఇప్పుడు రెండోది ఎందుకని ప్రశ్నించింది. వేద నిలయాన్ని స్వాధీనం చేసుకోవడం స‌మజ‌సం కాద‌ని తేల్చి చెప్పింది. వేద నిల‌యాన్ని ఆమె వారసురాలైన దీపకు అందించాలని ఆదేశించింది. వేద నిలయం జయ వారసులకే చెందుతుందని స్పష్టం చేసింది.

Read Also; https://telugu.asianetnews.com/international/covid-19-is-biggest-threat-to-child-progress-in-unicefs-75-year-history-r3wd3m

వేదనిలయం తమకు అప్పగించడంపై దీప సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ ఇది సాధారణ విజయం కాదు. జయలలిత మరణం తర్వాత ఆ ఇంటిలోకి తొలిసారి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ ఇంటిలోనే పుట్టాను. అత్త జయలలితతో ఈ ఇంటిలో గడిపిన ఎన్నో జ్ఞాపకాలతో నా మనసు నిండిపోయింది’ అని దీప భావోద్వేగానికి గురయ్యారు ’’ అని దీప పేర్కొన్నారు. భర్త మాధవన్‌, శ్రేయోభిలాషులతో కలిసి వేద‌నిల‌యంలో అడుగుపెట్టారు. అనంత‌రం జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇకపై ఇది రాజకీయాలకు వేదిక కాబోదని స్పష్టం చేశారు.

Read Also; https://telugu.asianetnews.com/international/road-accident-in-mexico-at-least-49-migrants-killed-58-injured-r3vtji

వేద నిల‌యాన్ని జయలలిత తల్లి వేదవల్లి 1960లో కొనుగోలు చేశారు. దశాబ్దాల పాటు జయలలిత అందులోనే నివాసం ఉన్నారు. జయలలిత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2016 డిసెంబర్‌లో మరణించారు. ఆమె మ‌రణానంతరం వేద నిలయాన్ని స్మారకంగా మార్చ‌బోతామ‌ని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన బిల్లును 2020 జులైలో తీసుకురాగా.. ఈ ఏడాది జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి దీన్ని ప్రారంభించారు.