మెక్సికోలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 49 మంది మృతి
ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. మృతులు ఏ దేశ జాతీయులు అనేది వెంటనే తెలియ రాలేదు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటెలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించినట్లు రుటెలియో ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మెక్సికో : మెక్సికో లో జరిగిన ఘోర road accidentలో 49 మంది వలసదారులు మరణించారు. Migrant workers ప్రయాణిస్తున్న Truck రిటైనింగ్ గోడను ఢీకొని చియాపాస్ లో బోల్తా పడిందని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ దుర్ఘటనలో మరో 40 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాసిక్యూటర్ల ప్రాథమిక నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న అక్రమ వలసదారులకు గ్యాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన
Chiapasప్రధాన రవాణా కేంద్రంగా మారింది. రాష్ట్ర రాజధాని Tux tla Gutierrez తో కలిపే హైవే పై వస్తుండగా ట్రక్కు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. మృతులు ఏ దేశ జాతీయులు అనేది వెంటనే తెలియ రాలేదు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటెలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించినట్లు రుటెలియో ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ఘోర ప్రమాదానికి ఎవరు కారణమనేది చట్టం నిర్ణయిస్తుందని, దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని రుటెలియో చెప్పారు.
International Flights: డీజీసీఏ సంచలన నిర్ణయం .. అప్పటి వరకూ అంతర్జాతీయ విమానాలు రద్దు
ఇదిలా ఉండగా, గత నవంబర్ ఏడున మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మెక్సికో నగరాన్ని ప్యూబ్లా (Puebla) నగరంతో కలిపే హైవే పై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. టోల్ బూత్ వద్ద ఉన్న వాహనాలపైకి.. ఓ భారీ ట్రక్ దూసుకొచ్చింది. బ్రేక్‌లు పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనాలను ట్రక్కు ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో.. పలు వాహనాలు దగ్దమయ్యాయి.
"టోల్ బూత్‌ను దాటుతున్నప్పుడు, ట్రక్ ఆరు వాహనాలను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నారు" అని ఆ దేశ ఫెడరల్ హైవే అథారిటీ, CAPUFE శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టుగా అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో దగ్దమైన వాహనాలను అక్కడి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భాగం వరకు ట్రాఫిక్‌ను అనుమతించడం లేదని చెప్పారు. కాగా, ఈ హైవేపై ఎక్కువగా భారీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.