Asianet News TeluguAsianet News Telugu

మోడీ-జీ...దయచేసి మాకో మంచి స్కూల్ కట్టించండి.. జమ్మూ స్కూల్ విద్యార్థిని వీడియో వైరల్...

తమకో మంచి స్కూలు కట్టించమని ఓ చిన్నారి ప్రధాని మోడీకి చేసిన విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాకి చెందిన ఆ చిన్నారి వీడియో వైరల్ అయ్యింది. 

Jammu Kashmiri Schoolgirl Request Video to PM modi goes viral - bsb
Author
First Published Apr 14, 2023, 2:16 PM IST

జమ్మూ కాశ్మీర్ :  సీరత్ నాజ్ అనే జమ్మూ కాశ్మీర్ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అమాయకంగా ప్రధాని మోడీకి చేసుకున్న ఓ విన్నపం అందర్నీ ఆకట్టుకుంటోంది.  తన పాఠశాలలో స్నేహితులతో కలిసి అపరిశుభ్రమైన నేలపై కూర్చోవలసి వచ్చినందుకు సంతోషంగా లేదని, ప్రధాని దీనిమీద ఏదైనా చేయాలని కోరుకుంది.  

ఫేస్‌బుక్‌లో ఇప్పుడు వైరల్‌గా మారి ఒక వీడియోలో, జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలోని లోహై-మల్హర్ గ్రామానికి చెందిన అమ్మాయి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి - "దయచేసి మోడీ-జీ, మా కోసం ఒక మంచి పాఠశాలను కట్టించండి"అని వేడుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 'మార్మిక్ న్యూస్' అనే పేజీ ద్వారా ఫేస్‌బుక్‌లో ఈ వీడియో షేర్ చేయబడింది. దీనికి ఇప్పుడు దాదాపు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు 1,16,000 మందికి పైగా లైక్‌లు వచ్చాయి.

5 ని.లకంటే తక్కువగా ఉన్న ఈ వీడియోలో ఆ చిన్నారి తమ స్కూల్ టూర్ చూపించింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిని అని చెబుతూ మొదలు పెట్టింది. పాఠశాల కాంపౌండ్‌లో నడుస్తూ, 'మోదీ-జీ'కి స్కూలు ఎలా ఉందో చూపించింది. ఏం చేయచ్చో చెబుతుంది. లెన్స్‌లోకి చూస్తూ, "మోదీ-జీ, నేను మీకు ఒక విషయం చెప్పాలి" అంటూ తమ స్కూల్ దుస్థితిని తెలియజేసింది. 

ఈశాన్య భారతంలో మొద‌టి ఎయిమ్స్ ప్రారంభం.. కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు

మురికిగా ఉన్న ప్రిన్సిపల్ రూమ్, స్టాఫ్ రూం, క్లాస్ రూంలు చూపించింది. ఎంత గలీజ్ గా ఉందో చూడండి. మేము ఇక్కడే కూర్చోవాలి. అని చెబుతుంది. ఆ తరువాత మీకు మా బిల్డింగ్ బైటినుంచి చూపిస్తాను చూడండి అంటూ వర్చువల్ గా తమ స్కూలు భవనం పరిస్థితిని చూపిస్తుంది. సగం కట్టి వదిలేసిన భవనం.. గత ఐదేళ్లుగా ఇలాగే ఉందని చెబుతుంది. 

"దయచేసి, మోడీజీ.. మాకో మంచి స్కూలు కట్టించి ఇవ్వండి. ఈ మురికి ప్రాంతంలో కూర్చుంటే మా బట్టలు మురికిగా మారిపోతాయి. అది చూసి యూనిఫాం మురికిగా మారితే మా అమ్మలు తిడుతున్నారు. మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మొదటి అంతస్తు మెట్లు ఎక్కి, గ్రౌండ్ ఫ్లోర్‌లో అపరిశుభ్రంగా ఉన్న కారిడార్ ని చూపిస్తుంది. "దయచేసి మోడీ-జీ, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా కోరికను తీర్చండి" అని మరోసారి కోరుకుంటుంది.

స్కూలు పరిసరాలే కాదు.. స్కూల్లోని బాత్రూంను కూడా చూపిస్తుంది. విరిగిపోయిన తలుపులు, అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ చూపిస్తుంది. ఆ తరువాత కొత్త స్కూల్ బిల్డింగ్ వస్తుందని చెబుతూ తమకు రోజూ చూపించే ఖాళీ స్థలాన్ని చూపిస్తుంది.

ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ ఆ అమ్మాయి వీడియోను ముగించింది. "మోదీ-జీ, మీరు మొత్తం దేశాన్ని వింటారు. దయచేసి నా మాట కూడా వినండి. మాకు మంచి పాఠశాలను నిర్మించండి. మేము నేలపై కూర్చోనవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. అప్పుడు నా యూనిఫాం మురికిగా అవ్వదు. మా అమ్మ నన్ను తిట్టదు. మేమందరం బాగా చదువుకోవచ్చు. దయచేసి మా కోసం ఒక మంచి పాఠశాలను నిర్మించి ఇవ్వండి" అని ఆమె ముగించింది.

Follow Us:
Download App:
  • android
  • ios