Asianet News TeluguAsianet News Telugu

ఈశాన్య భారతంలో మొద‌టి ఎయిమ్స్ ప్రారంభం.. కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు

PM Narendra Modi in Assam : అస్సాం పర్యటనలో ప్రధాని న‌రేంద్ర‌ మోడీ శుక్రవారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు గుప్పించారు. "గత ప్రభుత్వాల విధానాల కారణంగా, మనకు వైద్యులు-వైద్య నిపుణుల సంఖ్య తక్కువగా ఉంది. భారతదేశంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు ఇది పెద్ద అడ్డంకిని క‌ల్పించింద‌ని" అన్నారు.
 

PM Modi inaugurates first AIIMS in North East India, PM Slams Congress RMA
Author
First Published Apr 14, 2023, 1:55 PM IST

PM Modi inaugurates first AIIMS in North East India: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న అస్సాం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈశాన్య భార‌తంలో మొద‌టి ఎయిమ్స్ ను ఆయ‌న ప్రారంభించారు. రాష్ట్రం బిహు పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రధాని గౌహతి చేరుకునీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో గౌహతి ఎయిమ్స్ ను ప్రారంభించారు.

 

 

రూ.1,123 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ క్యాంపస్ ను నిర్మించారు. మొత్తం ఈశాన్య ప్రాంతంలో ఇదొక్కటే ఉంది. ఈ భవనానికి 2017లో ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపన చేశారు. అంతకుముందు హిమంత బిశ్వ శర్మ లోక్ ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని రాక అనంతరం శర్మ ట్విటర్ లో 'గౌరవనీయ ప్రధాని న‌రేంద్ర మోడీజీని అస్సాంకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు.

 

 

ఈ సందర్భంగా హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డుల పంపిణీకి చొరవ తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెలన్నరలో ఈ సంఖ్య 3.3 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులు ఈ కార్డులతో రూ .5 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య చికిత్స ప్రయోజనాలను పొందవచ్చున‌ని తెలిపారు.

 

 

అస్సాంలో బిహు వసంతోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ రూ.14,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు. ఐఐటీ గౌహతి, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన, నామ్ రూప్ లో 500-టీపీడీ మిథనాల్ ప్లాంట్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. అస్సాం పర్యటనలో ప్రధాని న‌రేంద్ర‌ మోడీ శుక్రవారం కాంగ్రెస్ నేతృత్వంలోని గ‌త యూపీఏ ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు గుప్పించారు. "గత ప్రభుత్వాల విధానాల కారణంగా, మనకు వైద్యులు-వైద్య నిపుణుల సంఖ్య తక్కువగా ఉంది. భారతదేశంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు ఇది పెద్ద అడ్డంకిని క‌ల్పించింద‌ని" అన్నారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios