Amritsar massacre: బ్రిటిష్ పాలనలోని క్రూరత్వం, దౌర్జన్యాలకు ప్రతీకగా నిలిచిన జ‌లియన్‌వాలాబాగ్ ఊచకోత నేటితో 103 ఏండ్లు పూర్తి చేసుకుంది. భార‌త చ‌రిత్ర‌లో చీక‌టిరోజుగా నిలిచిన ఈ మార‌ణ‌హోమాన్ని గుర్తుచేసుకుంటూ.. అమ‌ర‌వీరులకు ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.  

Jallianwala Bagh massacre: ఆంగ్లేయుల‌ క్రూరత్వం, దౌర్జన్యాలకు అద్దంప‌ట్టే అతి భయంకరమైన జ‌లియ‌న్‌వాలాబాగ్‌ సంఘటన జరిగి 103 ఏళ్లు దాటినా భారతదేశ చరిత్రలో ఇప్పటికీ అది చీకటి రోజుగా మిగిలిపోయింది. 103 ఏండ్ల క్రితం ఇదే రోజున ఏప్రిల్ 13-1919 న వైసాఖి పండుగ రోజున బ్రిటిష్ పాల‌కులు మార‌ణ‌హోమాన్ని సృష్టిస్తూ..ర‌క్తాన్ని ఏరులైపారించారు. అనేక మంది భార‌తీయుల ప్రాణాలు తీశారు. యావ‌త్ భార‌తావ‌ని ఆ ఘ‌ట‌న‌ను మ‌ర్చిపోలేక‌పోతోంది. స్వ‌తంత్య్ర ఉద్య‌మాన్ని ఈ ఘ‌ట‌న మ‌రోమ‌లుపు తిప్పింది. మందిల మంది ప్రాణాలు కోల్పోయిన జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌ను గుర్తుచేసుకుంటూ.. అమ‌ర‌వీరులకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. 

“1919లో ఈ రోజున జలియన్‌వాలాబాగ్‌లో అమరులైన వారికి నివాళులు. వారి అసమానమైన ధైర్యం మరియు త్యాగం రాబోయే తరాలను చైతన్యవంతం చేస్తూనే ఉంటుంది. గత ఏడాది జలియన్‌వాలాబాగ్ స్మారక్ పునర్నిర్మించిన కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో నా ప్రసంగాన్ని పంచుకుంటున్నాను ” అని ప్రధాని న‌రేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఈ హత్యలు బ్రిటిష్ పాలనలోని 'క్రూరత్వం మరియు దౌర్జన్యాలకు' ప్రతీకగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. “మన అమర అమరవీరుల పరాక్రమం మరియు ధైర్యానికి నేను నమస్కరిస్తున్నాను. భారతమాతను విముక్తి చేయడానికి మీ త్యాగం మరియు అంకితభావం రాబోయే తరాలకు దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేలా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

“మన అమరవీరుల త్యాగాన్ని ఎప్పటికీ మరువలేము. ఈ స్వాతంత్య్రం కోసం మేం వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం' అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…