అయోధ్య రామమందిరానికి చేరుకున్న ‘‘ జల కలష్ యాత్ర ’’ .. ప్రాణ్ ప్రతిష్ట కంటే ముందుగానే
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సాంస్కృతిక, మతపరమైన కేంద్రంగా వున్న అయోధ్యకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ సన్నాహాల మధ్య బుధవారం ‘జల్ కలష్ యాత్ర’’ అయోధ్యకు చేరుకుంది.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సాంస్కృతిక, మతపరమైన కేంద్రంగా వున్న అయోధ్యకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ సన్నాహాల మధ్య బుధవారం ‘జల్ కలష్ యాత్ర’’ అయోధ్యకు చేరుకుంది. దాదాపు 500 మంది మహిళా భక్తులు యాత్రగా శ్రీరామ జన్మభూమికి చేరుకున్నారు.
నిర్మలమైన, పవిత్రమైన సరయూ ఘాట్ నుంచి ప్రారంభమైన జల్ కలష్ యాత్రలో కలశాన్ని తలపై మోస్తూ రాముడిని స్తుతిస్తూ మహిళలు ఊరేగింపుగా వచ్చారు. గిరిష్ పట్టి త్రిపాఠి సతీమణి రామలక్ష్మీ త్రిపాఠి నేతృత్వంలో ఊరేగింపు రామమందిరానికి చేరుకుంది. పవిత్రోత్సవానికి ముందు ఇది ఆధ్యాత్మిక శోభను అయోధ్యలో నింపింది. ప్రార్ధనలు, భక్తి శ్రద్ధలతో నగరం ప్రతిధ్వనిస్తుండగా.. చారిత్రాత్మక రామాలయం ప్రారంభోత్సవం కేవలం అడుగు దూరంలో వుంది.
శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర్ నియమించిన అనిల్ మిశ్రా నేతృత్వంలో మంగళవారం ప్రారంభమైన ముడుపుల ఆచారాలు జోరందుకున్నాయి. ఖచ్చితంగా ఏడు రోజుల షెడ్యూల్‌లో శుద్ధి చేసే సరయూ నదీ స్నానం, పంచగవ్యప్రాశన, వాల్మీకి రామాయణ పఠనం వంటి పవిత్రమైన కార్యక్రమాలు వరుసగా జరగనున్నాయి.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టా వేడుక ఎంతో ప్రాముఖ్యతను కలిగి వుంది. ఇది ఆలయ అధికారిక ప్రతిష్టాపన. శ్రీరాముడి జన్మభూమిలో అద్భుతమైన ఆలయం నిర్మించాలనే చిరకాల వాంఛ సాకారమైన ఈ పవిత్ర కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నాటి కార్యక్రమాలలో జల్ కలష్ యాత్ర, తీర్ధయాత్ర పూజ, రాముడి విగ్రహ సందర్శనతో ఆచారాల కొనసాగింపు వున్నాయి. మైసూర్‌కు చెందిన శిల్పి యోగిరాజ్ డిజైన్ చేసిన రామ్ లల్లా విగ్రహం బరువుపై అనుమానాల నేపథ్యంలో కాస్త అలజడి నెలకొంది. రాబోయే పవిత్రోత్సవం కోసం దానిని ఎక్కడ వుంచాలనే దానిని నిర్ణయించారు.
వాస్తవానికి ప్రధాన పవిత్రోత్సవం జనవరి 22నే జరగాల్సి వుంది. అయితే వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం వున్నందున , జనవరి 21న ఒక రోజు ముందుగానే మోడీ అయోధ్యను సందర్శించాలని నిర్ణయించారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రఖ్యాత వేద ఆచార పండిట్ .. పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్.. ముడుపులను పర్యవేక్షిస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తూనే ఈ ఆచారానికి ప్రధాన హోస్ట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తారని ధృవీకరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడానికి పలువురు ఆయనకు సహాయం చేయనున్నారు.