Asianet News TeluguAsianet News Telugu

బెంగుళూరులో ఐటీ దాడులు: యడియూరప్ప సన్నిహితుడి ఇంట్లో సోదాలు,50 ప్రాంతాల్లో తనిఖీలు

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో గురువారం నాడు ఐటీ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంసీ యడియూరప్ప సన్నిహితుడు ఉమేష్ సహా పలువురి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

IT raids on Umesh and 50 other houses in Banglore
Author
Bangalore, First Published Oct 7, 2021, 11:52 AM IST

బెంగుళూరు: కర్ణాటక మాసీ సీఎం యడియూరప్ప సన్నిహితుడు ఉమేష్ నివాసంతో పాటు పలువురి ఇళ్లపై గురువారం నాడు income tax అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. umesh కార్యాలయాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా సమాచారం. మాజీ సీఎం yediyurappaకు సన్నిహితుడిగా పేరున్న ఉమేష్ ఇంట్లో కూడ ఐటీ అధికారులు సోదాలు చేశారు.

also read:

ఉమేష్ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలోనూ విపక్ష నేతగా ఉన్న సమయంలో కూడ ఉమేష్ ఆయన వద్ద పనిచేశాడు.

 

మరోవైపుbangloreలోని పలువురు వ్యాపార వేత్తలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల ఇళ్లలో కూడ ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు. 300 మంది ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

also read:హెటిరో డ్రగ్స్ సంస్థలో రెండో రోజూ ఐటీ సోదాలు: కీలక పత్రాలు స్వాధీనం

బెంగుళూరు నగరంలోని వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు.రాయల్ అపార్ట్‌మెంట్ లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సుమారు 120 కార్లను సీజ్ చేసినట్టుగా సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios