బెంగళూరు: సినీ హీరోయిన్ రష్మిక మందన్నకు ఆదాయం పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్ పెటెలోని నివాసంలో గురువారం ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఇంటిలోనే కాకుండా రష్మిక కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ్ మండపంలో జరిపిన ఐటి సోదాల్లో రూ. 25 లక్షల నగదును, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలను రష్మిక తల్లిదండ్రులు చూపలేకపోయార. 

Also Read: హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటి దాడులు: విస్తుపోయే కారణం

ఈ నెల 21వ తేదీన బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వాటి వివరాలు అందించాలని ఐటి శాఖ అధికారులు రష్మికకు నోటీసులు పంపించారు. ఈ నోటీసులకు రష్మిక ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

రష్మిక ఇంటిపై ఐటి దాడులు జరిగినట్లు వచ్చిన వార్తలను ఆమె మేనేజర్ ఖండించారు. రష్మిక బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు హైదరాబాదులోనే ఉననాయని వెల్లడించారు. గీత గోవిందం సినిమాతో తెలుగులో రష్మిక క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

Also Read: రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. నిజం కాదంటున్న మేనేజర్!

రష్మిక ఇంటిపై ఐటి దాడుల వెనక రాజకీయం కోణం ఉందనే ప్రచారం సాగుతోంది. రష్మిక తండ్రి మదన్ మందన్న కాంగ్రెసు నాయకుడు. ఈ నేపథ్యంలోనే ఐటి దాడులు జరిగాయని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. 

Also Read: రష్మిక ఇంటిపై ఐటీ దాడులు.. రూ.25 లక్షలు స్వాధీనం!