గురువారం నాడు ప్రముఖ హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడి జరిగిందనే వార్తలను ఖండించిన ఆయన.. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు.

రష్మిక ప్రతి అకౌంట్, లావాదేవీలు హైదరాబాద్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. రష్మిక తండ్రి మదన వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు. కర్నాటకలో రష్మిక ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో నిజమనే అనుకున్నారంతా.. సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది.

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు..!

అయితే రష్మిక మేనేజర్ మాత్రం రష్మికకి సంబంధించిన వ్యవహారాలపై ఎలాంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు.  'గీత గోవిందం' సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది.

అప్పటివరకు కుర్ర హీరోలతో నటించిన ఈమెకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది.

తన తదుపరి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి జత కట్టబోతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలైంది. కొన్ని కీలక సన్నివేశాలను కేరళలో చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.