ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటి నుండి ఐటీ అధికారులు లెక్కల్లోకి రాని రూ.25 లక్షలు, అలానే రష్మిక ఇంటి కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగ రోజున కర్ణాటకలోని కొడుకు జిల్లాలో ఉన్న రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కారణంతో ఈ రైడ్స్ ని చేపట్టారు. గురువారం ఐటీ అధికారులు బెంగుళూరు నుండి విరాజ్ పేట్ కి చేరుకున్నారు. ఆ సమయంలో రష్మిక షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆమె తల్లితండ్రులను ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలను వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు..!

అలానే రష్మిక తల్లితండ్రుల నుండి రష్మిక బ్యాంక్ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రష్మిక మేనేజర్ మాత్రం ఆమెకి సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని.. ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని చెప్పారు.   'గీత గోవిందం' సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది.

రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. నిజం కాదంటున్న మేనేజర్!

అప్పటివరకు కుర్ర హీరోలతో నటించిన ఈమెకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తన తదుపరి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి జత కట్టబోతుంది.