Asianet News TeluguAsianet News Telugu

సీమా పాత్ర కర్కశత్వాన్ని బయటపెట్టింది కుమారుడే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సునీత వీడియో..

గిరిజన మహిళను సీమాపాత్ర చెర నుంచి విడిపించింది ఆమె కుమారుడు ఆయుష్మాన్ అని సునీత ఓ వీడియోలో పేర్కొన్నారు. దీని కోసం ఆయన తన స్నేహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి సాయం తీసుకున్నారు. 

It is the son who revealed the harshness of the mother Seema patra.. Sunitha's video is going viral on social media..
Author
First Published Sep 1, 2022, 11:07 AM IST

29 ఏళ్ల గిరిజన పని మనిషి సునీతను చిత్రహింసలకు గురి చేసిన ఆరోపణలపై సస్పెండ్ అయిన బీజేపీ నాయకురాలు సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అయితే ప‌ని మ‌నిషి ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన అనుచిత తీరును బ‌య‌ట‌పెట్టింది. ఆమె కుమారుడే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

సీమా పాత్ర ఆ మహిళను రాంచీలోని అశోక్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో కొన్నేళ్లుగా బందీగా ఉంచింది. ఆమె క‌ష్టాల‌ను వివ‌రిస్తూ ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. దీంతో సీమా పాత్ర‌ను అరెస్టు చేయాల‌నే డిమాండ్ పెర‌గ‌డంతో బీజేపీ కూడా ఆమెను స‌స్పెండ్ చేసింది.

దారుణం : తోపుడు బండిపై గర్భిణీ భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త...కానీ..

అయితే సునీత వీడియో రికార్డ్ చేసి బ‌య‌ట‌కు విడుద‌ల చేసింది. ఆమెను ర‌క్షించింది కూడా సీమా పాత్ర కుమారుడు ఆయుష్మాన్ అని ప‌లు క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీని కోసం తన స్నేహితుడు, ప్ర‌భుత్వ ఉద్యోగి అయిన వివేక్‌ ఆనంద్‌ బాస్కీ స‌హాయం తీసుకున్నార‌ని నివేదిక‌లు వెలువ‌డుతున్నాయి. వివేక్ ఇచ్చిన స‌మాచారం మేరకు రాంచీ పోలీసులు గత వారం ఆ మహిళను పాత్ర నివాసం నుంచి రక్షించారు. మంగళవారం మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

సీమా పాత్ర త‌న‌ను శరీర‌కంగా వేధింపుల‌కు గురి చేశార‌ని ఆ వీడియోలో సునీత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తనను ఇనుప రాడ్ ల‌తో కొట్టేవార‌ని, రాళ్ల‌ను నోటితో ప‌గులగొట్టించే వార‌ని, యూరిన్ ను నాలుక‌తో నాకించేవార‌ని ఆమె తెలిపారు. త‌న‌ను కాపాడింది సీమా పాత్ర కుమారుడు ఆయుష్మాన్ అని ఓ వీడియోలో ఆమె తెలిపారు.

అయితే సునీత‌ను కాపాడినందుకు కుమారుడిని సీమా పాత్ర వ‌ద‌లలేదు. అత‌డికి మాన‌సిక ఆరోగ్యం బాగోలేద‌ని చెబుతూ రాంచీలోని ఓ హాస్పిటల్ లో చేర్పించారు. కాగా.. తీవ్ర గాయాల‌తో ఉన్న సునీత ప్ర‌స్తుతం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతోంది. 

భార్యమీద అలిగి తాటిచెట్టెక్కాడు.. నెలరోజులుగా, తిండి,నిద్ర.. మకాం అక్కడే.. ఎక్కడంటే...

ఇదిలా ఉండ‌గా.. బీజేపీ నాయ‌కుడు, మాజీ సీఎం బాబులాల్ మరాండి ఆసుపత్రిలో సునీతను పరామర్శించారు. తాము బాధితురాలిని కలవడానికి ఇక్కడకు వచ్చామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నారు. గిరిజ‌న మ‌హిళ సీమా పాత్ర ఇంట్లో ప‌ని చేసేద‌ని పేర్కొన్నారు. అయితే సునీత‌ను సీమా పాత్ర కొట్టిన తీరు స‌రిగా లేద‌ని, అందుకే పార్టీ ఆమెను స‌స్పెండ్ చేసింద‌ని తెలిపారు. కాగా సీమా పాత్ర సెప్టెంబర్ 12 వరకు పోలీసు రిమాండ్‌కు పంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ చౌరాసియా తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios