Asianet News TeluguAsianet News Telugu

భార్యమీద అలిగి తాటిచెట్టెక్కాడు.. నెలరోజులుగా, తిండి,నిద్ర.. మకాం అక్కడే.. ఎక్కడంటే...

నెల రోజులుగా ఓ వ్యక్తి తాటిచెట్టుమీదే కాపురం పెట్టాడు. కారణం ఏంటా అని ఆరా తీస్తే.. భార్య పెట్టే బాధ భరించలేక అంటూ చెబుతున్నాడు. అయితే చుట్టుపక్కలవాళ్లు మాత్రం తమ గోప్యతకు భంగం కలుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. 

fight with wife, man decides to live on 80-feet-tall palm tree in uttar pradesh
Author
First Published Sep 1, 2022, 10:09 AM IST

ఉత్తరప్రదేశ్‌ : భార్యమీద కోపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు?? గొడవ పడతారు.. కాస్త మోటు మనుషులైతే రెండు తగిలిస్తారు...కాస్త సెన్సిటివో.. ఈగో పర్సనో అయితే.. అలుగుతారు.. ఇల్లొదిలి వెళ్లిపోతారు. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ భర్త విచిత్రంగా ప్రవర్తించాడు. భార్య నిత్యం గొడవపడుతుందని.. విసిగిపోయి.. తాటిచెట్టు ఎక్కేశాడు. నెల రోజులుగా అక్కడే మకాం పెట్టాడు. తిండి, నిద్ర.. చివరకు కాలకృత్యాలు కూడా అక్కడే తీర్చుకుంటున్నాడు. 

వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా.. ఇది నిజం. ఉత్తరప్రదేశ్ లోని మావ్ జిల్లా కోపగంజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో పడలేక.. ఆమె మీద విసిగిపోయి, కోపంతో 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టు ఎక్కాడు. నెలరోజులుగా అక్కడే ఉంటున్నారు. అతని పేరు రామ్ ప్రవేశ్. వయసు 42 యేళ్లు. ఎంత చెప్పినా కిందికి దిగి రావడం లేదు. దీంతో అతడిని అలా అన్నపానీయాలు లేకుండా వదిలేయలేక.. చెట్టుమీదికే ఆహారాన్ని అందిస్తున్నారు. 

భార్య పుట్టింటికి వెళ్లి పోయిందని.. అలిగి కొబ్బరి చెట్టెక్కిన భర్త.. చివర్లో ట్విస్ట్...

పోలీసులు, గ్రామస్తులు వచ్చి చెప్పినా అతను ఒప్పుకోలేదు. దీంతో ఏమీ చేయలేక పోలీసులు కూడా వెనక్కి తిరిగారు. అయితే.. రామ్ రాత్రిపూట చెట్టుదిగి కాలకృత్యాలు తీర్చుకునేవాడని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. ఇకపోతే.. రామ్ చెట్టెక్కడం.. ఆ కుటుంబానికే కాదు.. చుట్టుపక్కల కుటుంబాలకూ ఇబ్బందిగా మారింది. ఎలాగంటే.. రామ్ ఎక్కి తాటిచెట్టు చుట్టుముట్టు చాలా ఇళ్లు ఉన్నాయి. వారు తమ ఇళ్లలో ఏం చేస్తున్నారో చెట్టు మీదినుంచి రామ్ గమనిస్తున్నాడని వారు గగ్గోలు పెడుతున్నారు. దీనివల్ల తమ ఏకాంతానికి, గోప్యతకు భంగం కలుగుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. 

దీంతో పోలీసులు అతడిని చెట్టుమీదినుంచి దించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రామ్ తండ్రి మాట్లాడుతూ.. ఎంత చెప్పినా వాడు వినడం లేదంటూ వాపోతున్నాడు. ఈ మొండిఘటం ఎప్పుడు చెప్పు దిగుతాడా అని కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కలవాళ్లూ ఎదురుచూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios