ధీరజ్ సాహుపై ఐటీ దాడులు.. కేంద్రం కాంగ్రెస్ నే ఎందుకు టార్గెట్ చేస్తోందన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..

కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)నే ఎందుకు టార్గెట్ చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)ప్రశ్నించారు. బీజేపీ (BJP) నాయకులపై కూడా ఐటీ రైడ్స్ జరిగితే వారి దగ్గర ఎంత అక్రమ నగదు ఉందో బయటపడుతుందని చెప్పారు.

IT attacks on Dheeraj Sahu.. Karnataka CM Siddaramaiah asks why Center is targeting Congress..ISR

ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు సంబంధించిన కార్యాలయాల్లో ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఇందులో రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బీరువాల్లో ఉన్న నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పరిణామాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కేంద్రం కేవలం కాంగ్రెస్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని అన్నారు. కానీ బీజేపీని టార్గెట్ చేయడం లేదని ఆరోపించారు. 

బస్సులో మహిళకు టికెట్ ఇచ్చిన కండక్టర్.. విచారణకు ఆదేశించిన టీఎస్ ఆర్టీసీ

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తోందని చెప్పారు. బీజేపీ నేతలపై కూడా దాడులు జరిగాలని, అప్పుడే వారి దగ్గర ఎన్ని అక్రమ డబ్బులు ఉన్నాయనే విషయం తెలుస్తుందని చెప్పారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎవరు నల్లధనం కూడబెట్టిన తప్పే అని చెప్పారు. అయితే కేంద్ర సంస్థలు కేవలం కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.

బీఎస్పీ అధినేత్రి మాయవతి వారసుడిగా ఆకాశ్ ఆనంద్.. అసలు ఎవరీయన.. ?

‘‘బీజేపీని కాదని, కేవలం కాంగ్రెస్ నేతలను మాత్రమే ఆ సంస్థలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీ వ్యక్తులపై దాడులు చేస్తే భారీ మొత్తంలో డబ్బు దొరుకుతుంది’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇదిలా ఉండగా.. ఒడిశాకు చెందిన బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దానితో సంబంధం ఉన్న సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది.

మా నాన్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. మద్యం తాగి గురుద్వారాకు వెళ్లారు- పంజాబ్ సీఎంపై కూతురు ఆరోపణలు..

అందులో భాగంగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన పలు కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు పట్టుపట్టింది. ఇది మొత్తం లెక్కిస్తే రూ.290 కోట్లు ఉన్నట్టు తేలింది. అయితే ఒకే రైడ్ లో ఇంత భారీ మొత్తంలో నల్లధనం ఇంత వరకు  ఎప్పుడూ పట్టుబడలేదని అధికారులు వెల్లడించారు. అయితే బీరువాల నిండా డబ్బు కట్టలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios