Asianet News TeluguAsianet News Telugu

బీఎస్పీ అధినేత్రి మాయవతి వారసుడిగా ఆకాశ్ ఆనంద్.. అసలు ఎవరీయన.. ?

బీఎస్పీ చీఫ్ మాయవతి తన మేనల్లుడిని పార్టీ వారసుడిగా ప్రకటించింది. ఇక నుంచి ఆకాశ్ నందన్ పార్టీ బాధ్యతలు చూసుకుంటారని చెప్పారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

Akash Anand as BSP chief Mayawati's successor..ISR
Author
First Published Dec 10, 2023, 3:52 PM IST

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ప్రకటించారు. ఆదివారం ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యతను మేనల్లుడికి అప్పగించారు.

ఆకాష్ ఆనంద్ ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీ పనితీరును పర్యవేక్షించనున్నారు. ఈ రెండు రాష్ట్రాలపై మాయవతి దృష్టి నిలపనున్నారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడు. 2017లో మాయావతి ఆకాష్‌ను పార్టీ సీనియర్ నాయకులకు.. లండన్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌గా పరిచయం చేసింది. పార్టీ వ్యవహారాల్లో కూడా పాల్గొంటానని చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆకాష్ ఆనంద్ బీఎస్పీ అధినేత ఎన్నికల ప్రచార వ్యూహం బాధ్యతలు చేపట్టారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేశారు. 2019లో బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమితులైన ఆకాశ్ కు.. 2022లో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు దక్కింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఆకాశ్ ఆనంద్ ప్రధాన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ పార్టీ రాజస్థాన్ లో రెండు స్థానాలు గెలుచుకోగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణల్లో ఘోర పరాజయం చవిచూసింది. గత ఏడాది నుంచి రాజస్థాన్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఆకాష్ ఆనంద్ కొనసాగుతున్నారు. 28 ఏళ్ల ఆకాష్ ఆనంద్ అనేక సందర్భాల్లో పార్టీ సీనియర్ నాయకులతో కనిపించారు. ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ప్రకారం, బాబా సాహెబ్ యువ మద్దతుదారుగా అభివర్ణించుకున్నాడు. కాగా.. 2024 లోక్ సభ ఎన్నికలకు కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios