Chandrayaan-3: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారతదేశం స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. ఈ తరుణంలో ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణ కీలక ప్రకటన చేశారు.

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పంపిన చంద్రయాన్3 విజయవంతంగా చంద్రునిపై దిగింది. ఈ క్రమంలో ఇస్రోను ప్రపంచ దేశాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయి.

ఈ తరుణంలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ చంద్రయాన్ 3 విజయంపై కీలక ప్రకటన చేశారు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిందని, చంద్రయాన్ 3 ప్రయోగానికి సహకరించిన శాస్త్రవేత్తలను మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ ప్రశంసించారు. 
సందర్భంగా నారాయణ్ మాట్లాడుతూ.., "ఇస్రో సాధించిన విజయం నమ్మశక్యం కానిదని పేర్కొన్నారు. చంద్రయాన్ 2 లోని ప్రతి వైపల్యం చంద్రయాన్ 3 విజయానికి దోహదం చేశాయని తెలిపారు.

చంద్రయాన్ 2 వైఫల్యం ఈ ప్రయోగానికి ఎంతో దోహద పడిందని తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ లాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చెందని పేర్కొన్నారు. ప్రయోగంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, ఆ సవాళ్లను ఎదుర్కొని మిషన్ ప్రధాన లక్ష్యాలను సాధించాలని ప్రతి శాస్త్రవేత్త భావిస్తాడని తెలిపారు. చంద్రయాన్ 3 విజయాన్ని సహకరించిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది ఇస్రో భారతదేశానికే ప్రపంచ మానవాళికి అందించిన విజయమని పేర్కొన్నారు.

Also Read: ISRO: ఈ సారి సూర్యుడు పై కన్నేసిన ఇస్రో.. త్వరలో ప్రయోగం..

మరో విధంగా చెప్పాలంటే.. సాధించిన విజయం నమ్మశక్యం కానిదేనని చెప్పాలి. మనకున్న బడ్జెట్ ఇతర కట్టుబాట్లు వైఫల్యం (చంద్రయాన్ 2) ఇస్రోను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. అయినప్పటికీ.. ఇస్రో మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ చేసిందని ప్రశంసించారు. ప్రయోగంతో ఇస్రో కీర్తి ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పేర్కొన్నారు.