భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విజయవంతంగా అడుగుపెట్టడంతో సూర్యునిపై అధ్యయనం చేయడానికి సిద్ధమైంది.
జాబిల్లిపై రహస్యాలను తెలుసుకోవడానికి ఇస్రో పంపిన చంద్రయాన్ 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ తరుణంలో ఇస్రో శాస్త్రవేత్తల కన్ను ఇప్పుడు సూర్యుని పై పడింది.
చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన కొన్ని గంటల్లోనే ఇస్రో కీలక ప్రకటన చేసింది.
సూర్యుని గురించి అధ్యాయం చేయడానికి ఆదిత్య ఎల్ 1 ను సెప్టెంబర్ మొదటి వారంలో పంపనట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథన్ మీడియాతో మాట్లాడుతూ.. సూర్యుని వాతావరణం, సౌర మంటలు, సౌర తుఫానులు, కరోనల్ అధ్యయనం కోసం భారతదేశం ఇప్పుడు తన వాహనాన్ని సూర్యునిపైకి పంపడానికి సిద్ధమవుతోందని అన్నారు. సూర్యుడు, చంద్రుని గురించిన కొత్త రివీల్షన్‌ల గురించి తెలుసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నామని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నామనీ, ఇండియన్ సన్ మిషన్ ఆదిత్య L1 మిషన్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరి వారంలో మిషన్ 'ఆదిత్య' ప్రయోగం చేయనున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ధృవీకరించారు. ఈ ప్రయోగ అనంతరం. తాము మొదటి మానవ సహిత మిషన్ (గగన్‌యాన్)ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. చంద్రయాన్ మిషన్ విజయవంతానికి సహకరించిన తోటి శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధృవం మానవ నివాసానికి అవకాశం ఉందని, అందుకే ఏజెన్సీ దీనిని ల్యాండర్‌కు ప్రాధాన్య ల్యాండింగ్ సైట్‌గా మార్చిందని ఆయన తెలిపారు.
Also Read: చంద్రయాన్ 3 : చందమామ ఎవరిది? వనరులకు హక్కుదారులెవరు? అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి?
" తాము (చంద్ర) దక్షిణ ధ్రువం ఇది ల్యాండర్ ఉంచిన ప్రదేశానికి 70 డిగ్రీల దూరంలో ఉంది. దక్షిణ ధృవం సూర్యుని నుండి తక్కువ కాంతిని పొందడంలో ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంది. మరింత శాస్త్రీయ పదార్థం (చంద్రుని యొక్క దక్షిణం వైపున) కారణంగా (మానవ నివాసానికి) అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని కనబరిచారు. ఎందుకంటే మానవులు చంద్రుడిని వలసరాజ్యం చేయడమే ప్రధాన లక్ష్యం. సుదూర భవిష్యత్తులో కాలనీలను ఏర్పాటు చేయగల ఉత్తమమైన ల్యాండింగ్ స్పాట్ కోసం చూస్తున్నామనీ, అందుకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం ఖచ్చితంగా సరిపో తుంది”అని ఇస్రో చీఫ్ చెప్పారు. భవిష్యత్తు లో లోతైన అంతరిక్ష పరిశోధనలకు కీలకం కానున్న పథ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నా మని తెలిపారు...
