Asianet News TeluguAsianet News Telugu

No Confidence Motion: అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటీ? ప్రధాని కచ్చితంగా మాట్లాడాలా? నిబంధనలేం చెబుతున్నాయి?

అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడితే స్పీకర్ అందుకు అనుమతించారు. మరో వారం రోజుల్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. మణిపూర్ హింసపై ప్రధానితో మాట్లాడాలించాలనే పట్టుదలతో ప్రతిపక్షాల ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే.. అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి కచ్చితంగా మట్లాడాల్సి ఉంటుందా? అంటే కచ్చితంగా మాట్లాడాలనే రూలేమీ లేదు.
 

is the prime minister duty bound to speak on no confidence motion in lok sabha, rules says kms
Author
First Published Jul 27, 2023, 3:35 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్‌లో చెలరేగిన హింస గురించి సమగ్రంగా చర్చించాలని, ప్రధానమంత్రి పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ విషయం శాంతి భ్రదతలకు సంబంధించినది, కాబట్టి, హోం మంత్రి అమిత్ షా మాట్లాడతారని ప్రభుత్వం చెప్పింది. హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు కూడా. కానీ, ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేవు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని ఆలోచనలు చేశాయి. అప్పుడే అమిత్ షా ఓ ప్రకటన చేశారు. మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఎంతసేపైనా చర్చిస్తుందని పేర్కొంటూ ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గేలకు లేఖ రాసినట్టు వెల్లడించారు. అయితే, ఆలోచనలు చేసినట్టుగానే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.

కాంగ్రెస్ ఎంపీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ మద్దతు తెలిపాయి. స్పీకర్ ఓం బిర్లా ఈ తీర్మానాన్ని అంగీకరించారు. త్వరలోనే ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి చర్చించడానికి సమయం నిర్ణయిస్తామని వివరించారు. ఈ తీర్మానాన్ని అంగీకరించిన పది రోజుల్లో చర్చ జరగాల్సి ఉంటుంది.

ఎన్డీయే ప్రభుత్వానికి ముప్పుందా?

ప్రధాని మోడీతో మణిపూర్ హింసపై పార్లమెంటులో మాట్లాడాలని సంకల్పించిన ప్రతిపక్ష పార్టీలు చిట్టచివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎంచుకున్నాయని ప్రతిపక్ష నేతలు చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని గెలుస్తామని తాము అనుకోవడం లేదనీ స్పష్టం చేశారు. లోక్‌సభలో బీజేపీకే సొంతంగా 303 ఎంపీల బలం ఉన్నది. ఎన్డీయే కూటమి మొత్తానికి 331 మంది సభ్యులు పార్లమెంటులో ఉన్నారు. ప్రస్తుత 26 పార్టీల ఇండియా కూటమికి 144 సభ్యుల బలం ఉన్నది. లోక్ సభలో 272 మంది సభ్యుల బలం కేంద్ర ప్రభుత్వానికి అవసరం. కాబట్టి, ఎన్డీయే ప్రభుత్వానికి ఈ అవిశ్వాస తీర్మానంతో వచ్చే ముప్పేమీ లేదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మణిపూర్ హింసపై మాట్లాడించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అంతకు మించి ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో కాదని తెలిసిపోతున్నది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం కనీసం 272 మంది సభ్యుల బలాన్ని చూపించకుంటే కూలిపోతుందన్న సంగతి తెలిసిందే. స్వతంత్ర భారతంలో 27 సార్లు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మూడు సార్లు ప్రభుత్వాలు కూల్పోయిన చరిత్ర ఉన్నది.

Also Read: ఈ నెల 29, 30వ తేదీన మణిపూర్ పర్యటించనున్న ప్రతిపక్ష ఎంపీలు

ప్రధాని తప్పనిసరిగా మాట్లాడాలా?

అవిశ్వాస తీర్మానం అంగీకరిస్తే దానికి ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. తన బలాన్ని నిరూపించుకుని కొనసాగాల్సి ఉంటుంది. ఈ అవిశ్వాస తీర్మానానికి లోక్ సభలో మంత్రి మండలి జవాబుదారీగా ఉంటుంది. మంత్రి మండలిలో అందరు మంత్రులు సమానమే. కానీ, ప్రధాని ఆ మంత్రులకు నాయకత్వ స్థానంలో ఉంటారు. కాబట్టి, సాధారణంగా అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి మాట్లాడుతుంటారు. కానీ, ఆయనే మాట్లాడాలనే నిబంధనేమీ లేదు. మంత్రి మండలిలోని ఏ మంత్రైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. లోక్‌సభలో ప్రొసీజర్ అండ్ కాండక్ట్ రూల్ 20 ఇదే చెబుతున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios