‘విదేశాల్లో వివాహాలు అవసరమా’?.. దేశంలోనే పెళ్లిళ్లు జరపండి - ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి
విదేశాల్లో పెళ్లిళ్ల కల్చర్ పెరగడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే వివాహాలు జరపాలని ప్రజలను కోరారు. దేశంలోనే పెళ్లిళ్లు జరిగితే ఇక్కడ డబ్బు తీరం దాటిపోదని అన్నారు. షాపింగ్ చేసే సమయంలో కూడా దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విదేశాల్లో వివాహాలు జరుపుకునే ధోరణి ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తన నెల వారీ 107వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్పందించారు. విదేశాల్లో కొన్ని పెద్ద కుటుంబాలు పెళ్లిళ్లు నిర్వహించే ధోరణి తనను కలచివేస్తోందని అన్నారు. భారత్ డబ్బు దేశం తీరం విడిచి వెళ్లకుండా చూడాలని, అందుకే అలాంటి వేడుకలు ఇక్కడే నిర్వహించాలని కోరారు.
నెలరోజు పాటు డిజిటల్ చెల్లింపులు చేయండి.. ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల సీజన్ గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ఏడాది దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేశాయని పేర్కొన్నారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ కోసం భారత్ లో తయారైన ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలని ప్రజలను కోరారు.
‘‘అవును.. పెళ్లిళ్ల విషయంలో ఒక అంశం నన్ను చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. నేను నా హృదయంలోని బాధను నా కుటుంబ సభ్యులకు చెప్పకపోతే, ఇంకెవరితో చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి వివాహాలు నిర్వహించే ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా?’’ అని ప్రధాని ప్రశ్నించారు.
విదేశాల్లో పెళ్లిళ్ల ట్రెండ్ ఆగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. అలా చేస్తేనే భారత ప్రజలకు ఇలాంటి కార్యక్రమాల్లో సేవలు అందించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ‘‘పేద ప్రజలు కూడా మీ పెళ్లి గురించి తమ పిల్లలకు చెబుతారు. 'వోకల్ ఫర్ లోకల్' మిషన్ ను మీరు విస్తరించలేరా ? ఇలాంటి వివాహ వేడుకలను మన దేశంలోనే ఎందుకు నిర్వహించకూడదు?’’ అని ప్రధాని అన్నారు.
ఇప్పటికే మీకు 50 ఏళ్లు.. ప్లీజ్ ఇకపై ఒంటరిగా ఉండొద్దు - రాహుల్ గాంధీకి ఓవైసీ సెటైర్లు..
ఇది చాలా పెద్ద కుటుంబాలకు సంబంధించిన అంశం అని ప్రధాని మోడీ అన్నారు. తన ఈ బాధ వారికి కచ్చితంగా చేరుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. దేశ నిర్మాణంలో ప్రజలు పెద్ద ఎత్తున పాలుపంచుకొని బాధ్యతలు చేపడితే ఆ దేశం అభివృద్ధి చెందకుండా ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోజాలదని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
Rahul Gandhi : ధరణి పేరుతో ప్రజల భూములను లాక్కున్నారు - బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు..
‘వోకల్ ఫర్ లోకల్’ అనే ఈ ప్రచారం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఉపాధి, అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్ ఉపాధికి హామీ అని, అభివృద్ధికి గ్యారంటీ అని తెలిపారు. ఇది దేశ సమతుల్య అభివృద్ధికి హామీ అని చెప్పారు. ఇది పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన అవకాశాలను అందిస్తుందని తెలిపారు.