ఐపీఎస్ అధికారంటే ఆయన హోదా, అధికారాల గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. ఆయన చెప్పిందే శాసనం, పోలీస్ వ్యవస్థను నడిపించే శక్తి. అటువంటి వ్యక్తి కన్నబిడ్డల కోసం ఏకంగా అర్ధరాత్రి రోడ్డుపై నిరసనకు దిగాడు.

వివరాల్లోకి వెళితే.. అరుణ్ రంగరాజన్ అనే ఐపీఎస్ అధికారి బెంగళూరులోని కాలబురగిలోని పోలీస్ అంతర్గత భద్రతా విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు

ఆయన మాజీ భార్య కూడా డీసీపీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గడ్‌లో పనిచేస్తున్న సమయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే వీరికి తొలి సంతానం కలిగింది. తరచుగా బదిలీలు జరుగుతూ ఉండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

Also Read:సామాన్యుడిలా పోలీస్ స్టేషన్ కి ట్రైనీ ఐపీఎస్.. ఫోన్ పోయిందని చెప్పి..

దీంతో వీటిని భరించలేక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేయకముందే అతని భార్య మరోబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే 2015లో ఫ్యామిలీ కోర్టు ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది.

తన ఇద్దరు పిల్లలను చూసేందుకు అరుణ్ రంగరాజన్ ఆదివారం సాయంత్రం బెంగళూరు వసంత్‌నగర్‌లో ఉంటున్న తన మాజీ భార్య ఇంటికి చేరుకున్నాడు. కానీ ఆ మహిళా ఐపీఎస్ మాత్రం మాజీ భర్తను ఇంట్లోకి రానివ్వలేదు.

Also Read:పౌరసత్వ బిల్లు నాకు నచ్చలేదు.. ఈ ఉద్యోగం వద్దు: ఐపీఎస్ రాజీనామా

అయినప్పటికీ తన పిల్లలను చూసేంతవరకు కదిలేది లేదంటూ ఆమె ఇంటి ముందే రంగరాజన్ బైఠాయించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా డీసీపీ తన మాజీ భర్త వేధిస్తున్నాడంటూ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.

ఇద్దరు తమ శాఖకు చెందిన వారే కావడంతో విషయం పెద్దదయితే పరువు పోతుందని భావించిన ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని రంగరాజన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పిల్లలను చూసేవరకు కదిలేది లేదని చెప్పడంతో పై అధికారులు కూడా చేసేదేమీ లేక వెల్లిపోయారు.