ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరాన్ని అరెస్ట్ చేయొద్దు

inx media case:HC extends interim protection for Chidambaram
Highlights

ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరాన్ని అరెస్ట్  చేయొద్దు

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఊరట లభించింది. ఆయన్ను ఆగస్టు  1 వరకు అరెస్ట్ చేయరాదని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2006 సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న చిదంబరం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని.. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌‌లో విదేశీ పెట్టుబడులు రావడానికి అనుగుణంగా  విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును ప్రభావితం చేశారని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో పెద్ద మొత్తం చేతులు మారిందని.. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరంపై ఇప్పటికే ఛార్జీషీటు దాఖలు చేశాయి.
 

loader