ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయం.. మహిళను హోటల్ కు పిలిపించి అత్యాచారం..
డేటింగ్ యాప్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి, మరొకరితో కలిసి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.

హర్యానాలో దారుణం జరిగింది. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి, మరొకరితో కలిసి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను హోటల్ కు పిలిచి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ దుశ్చర్యను వీడియో కూడా తీసి బ్లాక్ మెయిలింగ్ కు చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లోని సెక్టార్ 50 ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంత కాలం కిందట తన మొబైల్ లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంది. అందులో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారు కొంత కాలం పాటు అందులో స్నేహాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో అతడు ఆమెను ఓ హోటల్ కు రావాలని ఆహ్వానించాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తరచూ వీడియోలు పెడుతోందని చెల్లెలి హత్య.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
అతడి ఆహ్వానం మేరకు ఆమె జూన్ 29న హోటల్ కు వెళ్లింది. అక్కడ అంతకు ముందే అతడు ఓ గదిని బుక్ చేసి ఉంచాడు. గదిలోకి వెళ్లిన తరువాత ఆమెకు ఆహారం, కూల్ డ్రింక్స్ అందించాడు. వాటిని తిని, తాగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అతడు, తన స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యను వారి వీడియో రికార్డు చేశారు.
కేరళలో మోరల్ పోలీసింగ్ కేసు .. నలుగురి అరెస్ట్.. అసలేం జరిగింది?
కొంత సమయం తరువాత బాధితురాలు స్పృహలోకి వచ్చింది. దీంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ చేస్తామని ఆమెను నిందితులు హెచ్చరించారు. అక్కడి నుంచి ఆమె ఎలాగోలా ఇంటికి చేరుకుంది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. సెక్టార్ 50 పోలీసులు ఇద్దరు గుర్తుతెలియని నిందితులపై గ్యాంగ్ రేప్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్ వో ప్రవీణ్ మాలిక్ తెలిపారు.