సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తరచూ వీడియోలు పెడుతోందని చెల్లెలి హత్య.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
ఓ యువతిని ఆమె సోదరుడే హతమార్చాడు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అతడికి నచ్చకలేదు. ఈ విషయంలో వారిద్దరూ గొడప పడుతున్న సమయంలో క్షణికావేశంలో ఈ చర్యకు పాల్పడ్డాడు.

తన సోదరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, తరచూ వీడియోలు పెట్టడం ఆ సోదరుడికి నచ్చలేదు. ఈ విషయమై పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఒక రోజు ఆగ్రహంతో ఆమెను హతమార్చాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది.
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఇద్దరు మహిళ కార్మికుల మృతి.. భీతావహంగా మారిన ఘటనా స్థలి..
వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లెందు మండలంలోని రాజీవ్ నగర్ కు చెందిన 21 ఏళ్ల అజ్మీర సింధుకు హరిలాల్ అనే సోదరుడు, తల్లి ఉన్నారు. ఆమె ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసి, మహబూబాబాద్ లోని ఓ హాస్పిటల్ లో అప్రెంటిస్ గా పని చేస్తున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన వీడియోలను తరచూ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు. దీనిని సోదరుడు హరిలాల్ గమనించాడు.
'రాజీనామా చేసే ప్రసక్తే లేదు..': మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్
ఈ విషయం అతడికి నచ్చలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకూడదని, వీడియోలు పోస్ట్ చేయకూడదని సోదరికి చెప్పేవాడు. ఈ విషయంలో వారిద్దరికీ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఇలాగే సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో హరిలాల్ కోపంతో ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని హాస్పిటల్ లకు తీసుకెళ్లారు.
‘మణిపూర్’పై మాట్లాడటానికి మాకేం భయం లేదు.. చర్చకు సిద్ధం: ఉభయ సభల ప్రతిపక్ష నేతలకు అమిత్ షా లేఖ
అయితే అక్కడి నుంచి ఆమెను మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. వారి సూచన మేరకు ఆమెను వరంగల్ తరలిస్తుండగా పరిస్థితి విషమించి మరణించారు. అయితే మంగళవారం ఉదయం సమయంలో సింధు అంత్యక్రియలకు కుటంబ సభ్యులు హడావిడిగా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసుల విచారణలో అసలు ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. కాగా.. హరిలాల్ పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.