కేరళలో మోరల్ పోలీసింగ్ కేసు .. నలుగురి అరెస్ట్.. అసలేం జరిగింది?
కేరళలో మోరల్ పోలీసింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కాసర్‌గోడ్‌లోని మేల్‌పరాంబ వెళ్లిన ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తుల గుంపును కొంతమంది స్థానికులు ఆపి వేధింపులకు గురి చేశారు.

కేరళలో మరో మోరల్ పోలీసింగ్ ఘటనలో వెలుగులోకి వచ్చింది. కాసర్‌గోడ్‌లోని మేల్‌పరాంబ వెళ్లిన ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తుల గుంపును కొంతమంది స్థానికులు ఆపి వేధింపులకు గురి చేశారు. ఈ దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు మహిళలతో సహా నలుగురు స్నేహితులు తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల కోసం మేల్‌పారంబకు వచ్చారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం బేకల్ కోట నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో దారిలో వారు భోజనం చేయడానికి ఓ హోటల్ వద్ద కారు ఆపగా..కొందరు వ్యక్తులు యువకులు తమ కారును వేధింపులకు గురి చేశారని, దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
వారిని తమ కారులో ఎక్కకుండా వారిని ఆపి.. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ? ఇక్కడ ఏమి చేస్తున్నారు ? అని అడిగారని మేల్‌పరంబ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. ఈ మేరకు సమాచారం అందగా.. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని .. వేధింపులకు గురి చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు నలుగురి బృందాన్ని ఆపి వేధించినట్లు ఆరోపిస్తూ అధికారి తెలిపారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారి తెలిపారు. నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో సంఘటనకు సంబంధించిన విజువల్స్ చూడవచ్చు.