అనుమానం.. ప్రియురాలి పళ్లు పీకిన ప్రియుడు

Insecure Man Forces Live-In Partner To Get 2 Teeth Removed In Order To Look Unattractive
Highlights

అంతే ప్రియుడే ప్రియురాలికి ముందున్న రెండు పళ్లను పీకించి ఆమెను అందవిహీనం చేశాడు. దీంతోపాటు గీతాబెన్ కు ఇళ్లలో పని మాన్పించేశాడు.

అనుమానంతో ఓ వ్యక్తి తన ప్రియురాలి రెండు పళ్లను పీకేసి అందవిహీనంగా తయారు చేశాడు. ఈసంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...అహ్మదాబాద్ నగరానికి చెందిన గీతాబెన్ అనే మహిళ ఇళ్లల్లో పనులు చేస్తుండేది. ఆటోరిక్షా డ్రైవరు గీతాబెన్ ను ప్రేమించి ఆమెతో 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 

సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై అనుమానం ఏర్పడింది. అంతే ప్రియుడే ప్రియురాలికి ముందున్న రెండు పళ్లను పీకించి ఆమెను అందవిహీనం చేశాడు. దీంతోపాటు గీతాబెన్ కు ఇళ్లలో పని మాన్పించేశాడు. దీంతో ఆగకుండా ఇంట్లో ఉన్న తనను ఎవరూ చూడకుండా ఉండేలా కిటికీలకు ప్లాస్టిక్ షీట్లు అమర్చాడు. తనతో 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడే తనపై అనుమానంతో పళ్లు పీకించాడని బాధితురాలు గీతా బెన్ మహిళా హెల్ప్ లైన్ అభయంకు ఫిర్యాదు చేశారు.

loader