శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో తీవ్ర కుదుపులతో ఎమర్జెన్సీ ప్రకటించగా, ముందు భాగం దెబ్బతినడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు ఎండలు విపరీతంగా కాయగా..ఇప్పుడు వానలు అదే విధంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ తో పాటు పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులతో పాటు..భారీ వడగాళ్ల వాన కురిసింది.
ముందు భాగం దెబ్బతింది..
ఈ క్రమంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఓ ఇండిగో విమానం భిన్న వాతావరణం వల్ల గాల్లో ఉండగానే తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించారు. చివరకు విమానం సురక్షితంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ క్రమంలో విమానం ముందు భాగం దెబ్బతింది.దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎమర్జెన్సీ ప్రకటించిన…
ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో 6E2142 విమానానికి ప్రతికూల వాతావరణం ఎదుర్కొంది. దీంతో విమానం తీవ్ర కుదుపులకు లోనయ్యింది. దీంతో అందులో ప్రయాణికులు తీవ్ర భయాందోళలతో అరుపులు, కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్.. శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు విమానం సేఫ్ ల్యాండింగ్ అయినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు వెల్లడించారు. అయితే, విమానం ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది.
