Asianet News TeluguAsianet News Telugu

monkeypox : పూర్తిగా కోలుకున్న భార‌త్ మొద‌టి మంకీపాక్స్ పేషెంట్.. ప్ర‌క‌టించిన కేరళ ఆరోగ్య మంత్రి

ఇండియాలో మొదటి సారిగా మంకీపాక్స్ పాజిటివ్ గా తేలిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. అతడిని హాస్పిటల్ నుంచి త్వరలోనే డిశ్చార్జి చేస్తామని కేరళ ఆరోగ్య మంత్రి తెలిపారు. మిగిలిన ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. 

Indias first monkeypox patient fully recovered.. Kerala Health Minister announced
Author
Thiruvananthapuram, First Published Jul 30, 2022, 3:31 PM IST

దేశంలోనే తొలి కోతి వ్యాధి సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని కేర‌ళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే అతడిని డిశ్చార్జి చేస్తామని ఆమె శ‌నివారం తెలిపారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ద్వారా మొత్తం ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ప్లాన్ చేశారని అన్నారు. దేశంలోనే ఈ వైర‌స్ సోకిన తొలి కేసు కావ‌డంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సూచనల మేరకు 72 గంటల వ్యవధిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అయితే వాటిలో నెగిటివ్ గా నిర్దార‌ణ అయిన‌ట్టు చెప్పారు. ఇప్పుడు అత‌డు ఆరోగ్యంగా ఉన్నార‌ని చెప్పారు. 

న్యాయ వ్య‌వ‌స్థ‌ సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం అభినంద‌నీయం - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

మంకీపాక్స్ వైర‌స్ సోకిన బాధితుడి ప్రైమెరీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నఅత‌డి కుటుంబ సభ్యులను కూడా ప‌రీక్షించామ‌ని, అవి కూడా నెగిటివ్ ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్‌గా తేలిన మరో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉందని అన్నారు. వారికి మంచి ట్రీట్ మెంట్ అందుతోంద‌ని అన్నారు. 

కేరళకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి జూలై 12 న యూఏఈ నుంచి కేర‌ళ‌కు వ‌చ్చారు. అయితే ఇక్క‌డికి వ‌చ్చిన త‌రువాత అనారోగ్యానికి గురి అయ్యాడు. దీంతో అత‌డిని కొల్లంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో అక్క‌డి నుంచి త్రివేండ్రం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న అక్క‌డే చికిత్స పొందుతున్నారు. మొద‌ట్లో ఆయ‌న‌కు మంకీపాక్స్ సోకింద‌ని తేల‌డంతో బాధితుడితో ప్ర‌యాణించిన తల్లిదండ్రులతో పాటు11 మందికి ఈ వైర‌స్ ఉండ‌వ‌చ్చ‌నే ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. కానీ వారెవ‌రికీ వ్యాధి నిర్దార‌ణ కాలేదు. దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. 

Bhagat Singh Koshyari: వివాదాస్పద ప్రకటనపై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వివరణ.. బిజెపి నేత ఫైర్

1970లో కాంగోలో మంకీపాక్స్ ను తొలిసారిగా మనుషుల్లో గుర్తించారు.  కానీ ఆ తర్వా త దాదాపు 50 సంవత్సరాల వరకు వైరల్ ఇన్ఫెక్ష‌న్ అనారోగ్యం కొన్ని కేసులు ఆఫ్రికన్ ప్రాంతాల వెలుపల నుంచి స్థానికంగా నివేదించబడ్డాయి. అందుకే యూఎస్, యూకే, యూరప్, ఇండియాతో పాటు ఇతర ప్రాంతాలకు ఈ వ్యాధి అకస్మాత్తుగా వ్యాపించడం అందరినీ ఆశ్చర్యా నికి గురి చేసింది. కాగా ఈ వైర‌స్ వ్యాప్తిపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం మాట్లాడారు. ప్రస్తుతం వ్యాప్తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలిపారు. దేశాలు, సంఘాలు, వ్యక్తులు ఎవ‌రికి వారు ఈ వైర‌స్ ను సీరియ‌స్ గా తీసుకోవాల‌ని చెప్పారు. ‘‘ పురుషుల‌తో  సెక్స్ చేసే పురుషులు ప్ర‌స్తుతానికి మీ లైంగిక భాగస్వా ముల సంఖ్యను తగ్గించుకోవాలి. కొత్త భాగస్వా ములతో సెక్స్ విషయంలో ఒక సారి పునఃపరిశీలించాలి. ’’ అని ఆయన చెప్పారు. ఇదిలా ఉండ‌గా భారత్ లో మంకీపాక్స్ వైర‌స్ వ‌ల్ల ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ అన్నారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే నెల నుంచి కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios