Bhagat Singh Koshyari Clarification:  మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ మ‌హారాష్ట్ర నుంచి గుజ‌రాతీలు, రాజ‌స్థానీల‌ను వెళ్లిపోతే.. ముంబై, థానే లాంటి న‌గ‌రాల్లో  డ‌బ్బులు ఉండ‌వ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈవ్యాఖ్య‌ల‌పై దుమారం రేగ‌డంతో గ‌వ‌ర్న‌ర్ త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. 

Bhagat Singh Koshyari Clarification: మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో.. ఆ రాష్ట్ర‌ రాజకీయాల్లో మ‌ళ్లీ కలకలం రేగింది. మ‌హారాష్ట్ర ఒక‌వేళ నుంచి.. గుజ‌రాతీలు, రాజ‌స్థానీల‌ను వెళ్లిపోతే.. ముంబ‌యి, థానే లాంటి పెద్ద‌ న‌గ‌రాల్లో డ‌బ్బులు ఉండ‌వ‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు మ‌హా రాజ‌కీయాల్లో దుమారం రేపుతున్నాయి. 

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అంథేరిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. మ‌హారాష్ట్ర నుంచి గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు వెళ్లిపోతే.. మ‌హారాష్ట్ర ఆర్థిక రాజ‌ధాని ముంబయి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని అన్నారు. అయితే.. మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి చేసిన వ్యాఖ్య‌ల‌ను శివ‌సేన తీవ్రంగా ఖండించింది. ప‌లు చోట్ల నిరసన కార్య‌క్ర‌మాల‌ను చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శివ‌సేన సేవ‌కులు. ఎంపీ సంజ‌య్ రౌత్ కూడా గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి తీరును త‌ప్పుప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను సీఎం షిండే ఖండించాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ స్పాన్స‌ర్ చేసిన సీఎం అధికారంలో ఉన్నార‌ని, అందుకే మ‌రాఠీల‌కు అవ‌మానం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో ప‌లు చోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం కావ‌డంతో గవ‌ర్న‌ర్ త‌న‌ వ్యాఖ్య‌లపై వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌ ప్రకటనను వక్రీకరించారని భగత్ సింగ్ ఆరోపించారు. మహారాష్ట్ర నిర్మాణంలో మరాఠీల కృషి అత్యంత కీల‌క‌మ‌నీ, ముంబై మహారాష్ట్రకు గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌కి, మరాఠీ ప్రజలకు, ఈ గడ్డపై గవర్నర్‌గా సేవ చేసే అవకాశం లభించి నందుకు గర్వపడుతున్నాననీ అన్నారు. దీనివల్ల చాలా తక్కువ సమయంలో మరాఠీ భాష నేర్చుకోవాలని ప్రయత్నించానని చెప్పుకోచ్చారు.

శుక్ర‌వారం నాడు రాజస్థానీ సొసైటీ కార్యక్రమంలో తాను చేసిన ప్రకటనలో మరాఠీల‌ను తక్కువ అంచనా వేసే ఉద్దేశం త‌నకు లేదని ఆయన అన్నారు. తాను గుజరాతీ, రాజస్థానీల‌ వృత్తికి చేసిన సహకారం గురించి మాత్రమే మాట్లాడాననీ, మరాఠీలు కష్టపడి మహారాష్ట్రను నిర్మించారు. అందుకే అనేక మంది మరాఠీ పారిశ్రామికవేత్తలు నేడు ప్రసిద్ధి చెందాయ‌ని అన్నారు. మహారాష్ట్రలోనే కాదు.. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరాఠీ జెండాను పెద్ద ఎత్తున ఎగురవేస్తున్నారనీ, కాబట్టి మరాఠీ ప్రజల సహకారాన్ని తక్కువ అంచనా వేసే ప్ర‌సక్తి లేద‌ని అన్నారు.

గ‌తంలోలాగే త‌న ప్ర‌కటనను వక్రీకరించారని భగత్ సింగ్ అన్నారు. మహారాష్ట్ర నిర్మాణంలో మరాఠీల కృషి వెల‌క‌ట్ట‌లేనిద‌న‌నీ, మ‌హారాష్ట్ర అభివృద్దికి మ‌రాఠీలు చాలా దోహదపడ్డారు. ఇటీవల ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడాలనే దృక్పథం ఏర్పడింద‌నీ, దానిని మనం మార్చుకోవాలని. ఒక వర్గాన్ని అభినందిస్తే.. మరో సమాజాన్ని అవమానించడం కాదని అన్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి కారణం లేకుండా.. ఈ విష‌యంలో వివాదం సృష్టించకూడదని అన్నారు. వివిధ కులాలు, వర్గాలతో కూడిన ఈ మరాఠీ భూమి పురోగతి, అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం ఉందని, మరాఠీ ప్రజల సహకారం ఎక్కువగా ఉందని గవర్నర్ కోష్యారీ అన్నారు.