Asianet News TeluguAsianet News Telugu

ఎక్సర్‌సైజ్ చేయండి.. టికెట్ అందుకోండి: ప్రయాణికులకు రైల్వేశాఖ ఆఫర్

వ్యాయామాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. కొద్దిసేపు వ్యాయామం చేస్తే వారికి ఉచితంగా ఫ్లాట్‌ఫాం టికెట్ ఇస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

indian railways introduces machine which gives free ticket in exchange of 30 squats at anand vihar Railway station
Author
New Delhi, First Published Feb 21, 2020, 6:10 PM IST

నేటీ ఆధునిక జీవన విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాయామం ఒక్కటే మార్గమని వైద్యులు, పోషకాహార నిపుణులు తరచూ చెప్పే మాటే. కానీ ఆచరణలో ఇది అమలు చేసే వారిని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.

అయితే ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక ఆరోగ్యంపై ఆసక్తి చూపించే వారు చాలా తక్కువ. అందుకే వ్యాయామాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది.

Aslo Read:వాష్ రూమ్‌లుగా కదిలే బస్సులు.. ఓన్లీ ఫర్ వుమెన్ : పుణేలో వినూత్న ప్రయోగం

కొద్దిసేపు వ్యాయామం చేస్తే వారికి ఉచితంగా ఫ్లాట్‌ఫాం టికెట్ ఇస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందుకు గాను ఇక్కడ కొత్తగా ఓ ఫిట్‌నెస్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ముందు కొద్దిసేపు సిటప్స్ చేస్తే చాలు వారికి ఉచితంగా ఫ్లాట్‌ఫాం టికెట్ ఇస్తున్నారు అధికారులు. ఓ ప్రయాణికుడు ఇలాగే చేసి ఫ్లాట్ ఫాం టికెట్ పొందిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read:ఆన్సర్ షీట్లో రూ.100 పెట్టండి: విద్యార్థులకు కాపీ కొట్టడంపై ప్రిన్సిపాల్ చిట్కాలు

కాగా ఇప్పటికే రష్యయన్లకు వ్యాయామంపై అవగాహన కల్పించేందుకు గాను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్కడ 30 సిటప్స్ చేస్తే ఉచితంగా రైల్వే టికెట్ తీసుకోవచ్చు. ఈ విధానాన్ని ప్రేరణగా తీసుకున్న రైల్వే అధికారులు భారతదేశంలోనూ దీనిని అమలు చేయాలని నిర్ణయించి.. ఆనంద్ విహార్‌లో పరీక్షిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios