Asianet News TeluguAsianet News Telugu

అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో ఉద్రిక్తత: ఇండియా, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ

ఇండియా, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్ లో  ఈ నెల 9వ తేదీన  ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో  ఇరువైపులా  సైనికులు గాయపడ్డారు. 
 

Indian, Chinese soldiers clash at Tawang sector in Arunachal Pradesh
Author
First Published Dec 12, 2022, 8:04 PM IST

న్యూఢిల్లీ: ఇండియా, చైనా  సైనికుల మధ్య మరోసారి ఘర్షణ చోటు  చేసుకుంది.  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్ లో  ఈ నెల  9వ తేదీన  ఈ ఘర్షణ జరిగింది.  దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత  ఇరు వర్గాల సైనికులు ఈ ప్రాతం నుండి వెనక్కు వెళ్లారు.

గత ఏడాది అక్టోబర్ మాసంలో ఇదే ప్రాంతంలో  చైనా ఆర్మీని ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రశాంత నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా  ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు గాను  ఇరువైపులా కొన్ని ప్రయత్నాలు  చేశారు. ఈ విషయమై  చర్చలు జరిపారు.  కొన్ని సమస్యలు పరిష్కరించలేదు.సరిహద్దు వెంబడి  సాయుధ దళాలు మౌళిక సదుపాయాలను పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

సరిహద్దు వెంట భారత్, చైనా మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్తతలు సాగుతున్నాయి.  2020  జూన్ మాసంలో భారత్, చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో  ఓ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు.  తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన  సంతోష్ ఈ ఘర్షణలో మరణించారు. దేశంలోని మరో ఇద్దరు జవాన్లు మరణించారు. చైనాకు చెందిన సైనికులు కూడా ఈ ఘటనలో  మృతి చెందారు. అంతకు ముందు కూడా  సరిహద్దు వెంట రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య  ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. అయితే 2020  జూన్ లో చోటు  చేసుకున్న ఘటన తర్వాత రెండు దేశాల నుండి అధికారులు  శాంతిని పునరుద్దరించే ప్రయత్నాలు చేశారు. ఇరు వైపుల ఉన్నతాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. దీంతో శాంతియుత వాతావరణం నెలకొంది. అయితే  ఈ నెల 8వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios