Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ ఎల్వోసీ వద్ద ఇండియన్ ఆర్మీ తనిఖీలు.. భారీగా ఆయుధాలు, మాదకద్రవ్యాలు స్వాధీనం

బారముల్లా జిల్లోని ఉరిలో ఇండియన్ ఆర్మీ, జమ్మూా కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలో భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. 

Indian Army checks at Jammu and Kashmir LOC.. Heavy weapons and drugs seized
Author
First Published Dec 3, 2022, 4:07 PM IST

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉరి సెక్టార్ లో చొరబాట్లు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా నియంత్రణ రేఖ వెంబడి సాధారణ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ నవంబర్ 29, డిసెంబర్ 1 మధ్య తనిఖీలు నిర్వహించినట్టు శ్రీనగర్ డిఫెన్స్ పీఆర్వో తెలిపారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది.

‘ముందున్నది ఆట’.. బెంగాల్‌లో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సంకేతాలు

ఈ ఆపరేషన్ సమయంలో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో రెండు ఏకే 74 అసాల్ట్ రైఫిల్స్, రెండు చైనీస్ పిస్టల్స్, రెండు ఏకే  74 అసాల్ట్ రైఫిల్ మ్యాగజైన్లు, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, 117 రౌండ్ల ఏకే 74 అసాల్ట్ రైఫిల్ తో పాటు బారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

హిందువులు పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అందుకే..: అసోం ఎంపీ బద్రుద్దీన్

అలాగే నియంత్రణ రేఖకు 300 మీటర్ల దూరంలో పాకిస్తాన్ గుర్తులతో ఉన్న 10 సీల్డ్ మాదకద్రవ్యాల ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నారు. ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ వల్ల శత్రువుల ప్రణాళికలను విజయవంతంగా భగ్నం చేసినట్టయ్యింది. ఈ ఘటనపై ఉరి పోలీస్ స్టేషన్ లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా పంజాబ్ లోని భారత్‌-పాక్‌ సరిహద్దులో కూడా శుక్రవారం భారీ స్థాయిలో బీఎస్‌ఎఫ్‌ దళాలు హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పంజాబ్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ‘‘బీఎస్ఎఫ్ జవాన్లు, తరన్ తరణ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఆధునిక సాంకేతికతతో కూడిన హెక్సాకాప్టర్ డ్రోన్‌ను ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని పొలాల సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 5 కిలోల బరువున్నహెరోయిన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ’’ అని పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు.

బొగ్గు గనుల కమర్షియల్ వేలానికి కేంద్రం శ్రీకారం.. లిస్ట్‌లో సింగరేణిలోని నాలుగు

పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు అనేక డ్రోన్‌లు తుపాకీతో కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 30వ తేదీన కూడా తరన్ తరణ్‌లోని వాన్ తారా సింగ్ గ్రామంలో బీఎస్ఎఫ్ ఒక డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. నవంబర్ 28న బీఎస్ఎఫ్ సైనికులు తుపాకీతో కాల్చడంతో అది పొలంలో పడిపోయింది. రెండు రోజుల తరువాత దానిని స్వాధీనం చేసుకున్నారు. తమ శోధనలో ముళ్ల కంచె సమీపంలోని పొలంలో ఆ డ్రోన్ లభించినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రీతీందర్ సింగ్ తెలిపారు. అలాగే కలాష్ హవేలియన్ గ్రామంలో నవంబర్ 28వ తేదీన 7.5 కిలోల హెరాయిన్‌తో పాటు మరో హెక్సాకాప్టర్‌ను పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి డ్రోన్‌ వచ్చిందన్న అనుమానంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు రంగంలోకి దిగారు. దాదాపు 20 కిలోల బరువున్న ఆ హెక్సాకాప్టర్ భారీ పేలోడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇది సరుకును వదిలివేసిన తర్వాత తిరిగి తన ప్రదేశానికి వచ్చే టెక్నాలజీతో రూపొందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios