Asianet News TeluguAsianet News Telugu

బొగ్గు గనుల కమర్షియల్ వేలానికి కేంద్రం శ్రీకారం.. లిస్ట్‌లో సింగరేణిలోని నాలుగు

దేశంలోని బొగ్గు గనుల కమర్షియల్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం మొదలుపెట్టింది. ఇందులో సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులు కూడా వున్నాయి

Coal ministry hold commercial mine auction
Author
First Published Dec 3, 2022, 3:30 PM IST

దేశంలోని బొగ్గు గనుల కమర్షియల్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులను కూడా వేలానికి పెట్టింది. అయితే ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే.. బొగ్గు గనులను వేలం వేయబోమని చెప్పిన ప్రధాని మోడీ కోలిండియాను అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల కంపెనీగా గుర్తింపు తెచ్చుకుని, లాభాల్లో వున్న కోలిండియాలో వాటాలు విక్రయించడంపై పలువురు మండిపడుతున్నారు. కోలిండియాలోని 49 శాతం వాటాలను ప్రైవేట్ వాళ్లకు విక్రయిస్తామని గతంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేంద్రం పావులు కదుపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios