Asianet News TeluguAsianet News Telugu

హిందువులు పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అందుకే..: అసోం ఎంపీ బద్రుద్దీన్

హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని.. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటూ అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం యువకులు 21 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి చేసుకుంటారని, హిందూ పురుషులు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, 40 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Assam MP Badruddin Ajmal says Hindu men marry late to have illegal relations
Author
First Published Dec 3, 2022, 3:38 PM IST

ఆల్ యూనియన్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ హిందువులపై చేసిన వివాదాస్పద ప్రకటన అస్సాంలో ప్రకంపనలు సృష్టించింది. ఔరంగజేబుకు అజ్మల్ మరో వెర్షన్ అని అధికార బీజేపీ అజ్మల్ పై విరుచుకపడింది. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఆయన హరామ్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడు, దీనిని ఏ విధంగానూ సహించేది లేదని అన్నారు. ముస్లిం సంఘం అజ్మల్‌కు ఇచ్చిన మౌలానా బిరుదును ఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. మరోవైపు.. హిందూ యువతులపై బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై నౌగావ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో అస్సాంలోని హిందూ యుబా-ఛత్ర పరిషత్ ఫిర్యాదు చేసింది.

ఇంతకీ ఏం జరిగింది...? 
 
హిందువులు పిల్లల విషయంలో ముస్లింల ఫార్ములాను అవలంబించాలని, చిన్నవయసులోనే పిల్లలకు పెళ్లి చేయాలని హిందువులపై అజ్మల్ శుక్రవారం వివాదాస్పద ప్రకటన చేశారు. ముస్లిం యువకులు 20 నుండి 22 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటారు. ముస్లిం మహిళలు 18 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటారు. ఇది రాజ్యాంగబద్ధమైనది. హిందూ పురుషులు వివాహానికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకుని.. 40 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  హిందువులు యువకులు ముస్లింల ఫార్ములాను అనుసరించాలని, పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేయాలని అజ్మల్ అన్నారు. 

అస్సాంలోని కరీంగంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల తర్వాత.. బిడ్డకు జన్మనిచ్చే సత్తా ఎక్కడిదని అన్నారు. వారు ముస్లింల సూత్రాన్ని స్వీకరించి, 18-20 సంవత్సరాల వయస్సులో వారి పిల్లలకు వివాహం చేయాలని అన్నారు. లవ్ జిహాద్ విషయంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కూడా అజ్మల్ వ్యాఖ్యానించారు. శ్రద్ధా సంఘటనపై  సీఎం బిస్వా శర్మ స్పందిస్తూ..  ఆ హత్య లవ్ జిహాద్ అనే అన్నారు.  

సీఎం వ్యాఖ్యలపై అజ్మల్ మాట్లాడుతూ.. నేడు దేశంలోని అగ్రనేతల్లో ముఖ్యమంత్రి ఒకరని అన్నారు. వారిని ఎవరు ఆపుతున్నారు? మీరు కూడా నాలుగైదు లవ్-జిహాద్‌లు చేస్తూనే ఉన్నారు. మీరు మా ముస్లిం అమ్మాయిలను తీసుకెళుతున్నారు. మేము మీకు స్వాగతం పలుకుతాము , పోరాడమంటూ సంచలన వ్యాఖ్యలు అన్నారు. 

ఈ వివాదాస్పద ప్రకటనపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి రంజీవ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. అజ్మల్ నిజానికి ఔరంగజేబు మరొక వెర్షన్. అతను హరాం సంస్కృతికి సంరక్షకుడు,బేరర్ అని, ఆయన  ప్రకటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని, వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. దీనితో పాటు రాముడు,తల్లి సీత దేశంలో ఇది మహిళలకు చెందినదని, దీనిని సహించేది లేదని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే దిగంత్ కలితా గౌహతిలో మాట్లాడుతూ.. 'మీరు ముస్లిం, మేము హిందువులం. ఎలా జీవించాలో మేము మీ నుండి నేర్చుకోవాలా? ముస్లింల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది రాముడు, సీతా దేవి యొక్క భూమి. బంగ్లాదేశ్ ప్రజలకు ఇక్కడ స్థానం లేదు. మీరు అలాంటి ప్రకటన చేయాలనుకుంటే.. బంగ్లాదేశ్‌కు వెళ్లండి. ఇక్కడ మేము దీన్ని అస్సలు అనుమతించము. అని అన్నారు. ఈ మాటలు రాజ్యాంగ విరుద్ధమని, నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కాదని బీజేపీ ఎంపీ పబిత్రా మార్గెరిటా అజ్మల్‌ను విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios